mXmoto electric scooter: భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Oct 01, 2023 | 10:22 PM

ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్‌ సంస్థ ఎమ్‌ఎక్స్‌మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎంఎక్స్‌వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే ఇందులో సర్క్యూలర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఏప్రాన్‌ మౌంటెడ్‌ క్రోమ్‌ స్లేటెడ్‌ గ్రిల్‌, టేపరింగ్ బాడీ ప్యానెల్స్‌, డైనమక్‌ ఎల్‌ఈడీ లైట్స్‌ను అందించారు.

mXmoto electric scooter: భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర ఎంతో తెలుసా.?
Mxmoto Electric Scooter
Follow us on

ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజీల్‌ ధరలు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రేజ్‌ పెరుగుతోంది. పర్యావారణంపై అవగాహన పెరుగుతుండడం, ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో వాహనాలు కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఇక దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలు సైతం వరుసగా వాహనాలు లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్‌ సంస్థ ఎమ్‌ఎక్స్‌మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎంఎక్స్‌వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే ఇందులో సర్క్యూలర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఏప్రాన్‌ మౌంటెడ్‌ క్రోమ్‌ స్లేటెడ్‌ గ్రిల్‌, టేపరింగ్ బాడీ ప్యానెల్స్‌, డైనమక్‌ ఎల్‌ఈడీ లైట్స్‌ను అందించారు.

ఎల్‌ఈడీ లైట్స్‌ ఈ స్కూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్‌ డీఆర్‌ఎల్స్‌, వైడ్‌ హ్యాండిల్‌ బార్‌, స్లీక్‌ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌ వంటి ఫీచర్స్‌ను అందించారు. వీటితో పాటు ఎంఎక్స్‌వీ ఈకోలో టీఎఫ్‌టీ డిస్‌ ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, నేవిగేషన్‌ వంటి అధునాతన ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. మల్టీ స్పోక్‌ అలాయ్‌ వీల్స్‌ కూడా ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆటో రిపేర్‌ వంటి ప్రత్యేక ఫీచర్‌ను ఇందులో అందించారు. దీంతో ఒకవేళ బండిలో ఏదైనా పార్ట్‌లో సమస్య వస్తే వెంటనే తెలుసుకోవచ్చు. క్రూజ్‌ కంట్రోల్‌, రివర్స్‌ అసిస్ట్‌, పార్క్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్స్‌ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సొంతం.

ఇక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌తో తీసుకొచ్చారు. చిన్న బ్యాటరీ ప్యాక్‌ రేంజ్‌ 100 కి.మీల వరకు అందిస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక పెద్ద బ్యాటరీ రేంజ్‌ విషయానికొస్తే 120 కి.మీల వరకు మైలేజ్‌ ఇస్తుంది. 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ధర విషయానికొస్తే ఎక్స్‌షోరూం ధర రూ. 84,999గా ఉంది. ఇదిలా ఉంటే ఈ స్కూటర్‌ డెలివరీలు ఎప్పటి నుంచి మొదలవుతాయన్న దానిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి…