Mutual Fund: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని ఆపేస్తే ఏమవుతుందో తెలుసా?

|

Jan 20, 2024 | 11:04 AM

మీరు మీ SIPని ఆపివేసినా లేదా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను రీడీమ్ చేసినా, కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా మీకు మీరు పక్కకు తప్పుకుంటున్నట్టే. మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగించినట్లయితేనే మీరు కాంపౌండింగ్ నుండి ప్రయోజనం పొందవచ్చు. కాంపౌండింగ్ దీర్ఘకాలంలో అధిక రాబడిని సంపాదించడంలో మీకు సహాయపడుతుంది..

Mutual Fund: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని ఆపేస్తే ఏమవుతుందో తెలుసా?
Mutual Funds
Follow us on

ఓ వ్యక్తి గత 3 సంవత్సరాలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నారు. షేర్ మార్కెట్ బుల్ రన్‌ను ఎదుర్కొంటున్నందున, అతని పోర్ట్‌ఫోలియో బాగుంది. అయితే రానున్న రోజుల్లో మార్కెట్ కరెక్షన్ లేదా పతనాన్ని చూడబోతోందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీని కారణంగా పెరుగుతున్న తన పోర్ట్‌ఫోలియో ఎక్కడ నష్టాల్లోకి చేరుతుందో అని ఆకాష్ ఆందోళన చెందుతున్నాడు. ఆ వ్యక్తి లాగానే చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారు. దీనివల్ల వారు తమ SIPలను నిలిపివేయవచ్చు లేదా వారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రీడీమ్ చేసుకుంటారు. అయితే ఇది సరైన మార్గమేనా? దీనికి సమాధానం పెద్ద స్థాయిలో నో అని చెప్పాలి. మీరు అలా ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం.

SIPలు లేదా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల ద్వారా ఆ వ్యక్తి వంటి పెట్టుబడిదారులు ప్రతి నెలా ముందుగా నిర్ణయించిన తేదీలో ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. ఇతర మార్కెట్ల మాదిరిగానే, షేర్ మార్కెట్లు కూడా సైకిల్ మ్యానర్ లో పనిచేస్తాయి. ఒక్కోసారి మార్కెట్ పెరుగుతుంది, ఒక్కోసారి పతనం తప్పదు. కానీ మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు.. పెరుగుతున్న NAV లేదా నికర ఆస్తి విలువ ద్వారా అధిక విలువను పొందుతారు.

అదేవిధంగా, మార్కెట్ పడిపోయినప్పుడు, పెట్టుబడిదారులు వారి నిర్ణీత SIP మొత్తంలో మరిన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను పొందుతారు. దీనినే రూపాయి-వ్యయ సగటు అని కూడా అంటారు. మార్కెట్ పెరగడం ప్రారంభించిన వెంటనే, మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కు చెందిన NAV మీకు అధిక రాబడిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

NAV అనేది మీరు మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఒక యూనిట్‌ని కొనుగోలు చేయడానికి లేదా రిడీమ్ చేయడానికి అయ్యే ఖర్చు. మీరు ఒక నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ పథకంలో రూ. 5,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. దీనికి రూ. 200 NAV ఉంది. ఈ స్థితిలో, మీకు 25 యూనిట్లు (5,000/200) కేటాయిస్తారు. ఇప్పుడు, ఈ మ్యూచువల్ ఫండ్ NAV రూ. 200 నుండి రూ. 300కి పెరిగితే… ఆ సమయంలో మీరు మీ పెట్టుబడులను విక్రయించాలని నిర్ణయించుకుంటే, మీరు రూ. 7,500 (రూ. 300 x 25) తిరిగి పొందుతారు.

అందుకే మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రజలు తమ నెలవారీ SIPలను కొనసాగించాలని పెట్టుబడి నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో, SIPలు మీ పెట్టుబడిపై మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావాన్ని మార్చగలవు. అందుకే మార్కెట్లు పడిపోతాయనే భయంతో మీరు మీ SIPలను బ్రేక్ చేయకూడదు లేదా నిలిపివేయకూడదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల ద్వారా, మీరు దీర్ఘకాలంలో ముఖ్యమైన కార్పస్‌ని క్రియేట్ చేయవచ్చు. ఇల్లు కొనడం, మీ పిల్లలకు విదేశీ విద్యకు నిధులు సమకూర్చడం, సంపద సృష్టి లేదా పదవీ విరమణ ప్రణాళిక వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమే SIP ని ప్రారంభిస్తారు.

మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత మొత్తం అవసరం, ఎంత కాలానికి అవసరం అన్నదానిపై మీ SIP మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మార్కెట్ అస్థిరత కారణంగా మీరు మీ SIPలను ఆపివేసినట్లయితే లేదా మీ పెట్టుబడులను రీడీమ్ చేస్తే, మీరు మీ పెట్టుబడులకు నష్టం చేకూర్చడమే కాకుండా.. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కూడా మీరు లాస్ అవుతారు.

మీరు మీ SIPని ఆపివేసినా లేదా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను రీడీమ్ చేసినా, కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా మీకు మీరు పక్కకు తప్పుకుంటున్నట్టే. మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగించినట్లయితేనే మీరు కాంపౌండింగ్ నుండి ప్రయోజనం పొందవచ్చు. కాంపౌండింగ్ దీర్ఘకాలంలో అధిక రాబడిని సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ పెట్టుబడితో పాటు రాబడిపై మళ్లీ రాబడిని పొందుతారు. ఇది ప్రతి సంవత్సరం మీ మొత్తానికి కలుస్తూ వెళుతుంది. అంచే ఇది మీ నిధుల మొత్తాన్ని పెంచుతుందన్నమాట.

ఒక సాధారణ ఉదాహరణ ద్వారా కాపౌండింగ్ శక్తిని అర్థం చేసుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ. 2,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం, దాని ద్వారా మీరు సంవత్సరానికి  12% రాబడిని అంచనా వేస్తారు. ఈ విధంగా, 10 సంవత్సరాలలో, మీరు రూ. 2,40,000 పెట్టుబడి పెడతారు, అయితే ఈ మొత్తం వ్యవధిలో మీరు రూ. 4,60,000లు సంపాదిస్తారు. ఇది మీరు చేసిన పెట్టుబడికి దాదాపు రెట్టింపు. ఇది కాంపౌండింగ్ శక్తి. అయితే, మ్యూచువల్ ఫండ్లలో రాబడి స్థిరంగా ఉండదని గుర్తుంచుకోండి. మీ రాబడులు పెరగడం లేదా తగ్గే అవకాశం ఉంది.


షేర్ మార్కెట్ గణనీయమైన పతనాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా, మ్యూచువల్ ఫండ్స్ షేర్ల వలె తీవ్రంగా ప్రభావితం కావు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకాలు ఈక్విటీ, బాండ్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఒకటి కంటే ఎక్కువ అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెడతాయి. మేము ప్రత్యేకంగా ఈక్విటీ గురించి మాట్లాడినట్లయితే, పెట్టుబడులను వివిధ మార్కెట్ క్యాప్‌లు, వివిధ రంగాలలో పెడతారు. ఒకే రంగంలో కూడా, వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు.

దీనర్థం ఒక అసెట్ క్లాస్ బలమైన పనితీరు నిర్దిష్ట ఆస్తి, సెక్టార్ లేదా షేర్ బలహీన పనితీరును బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్లనే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు షేర్ల లాగ సడన్ క్రాష్‌కు గురికావు. ఒకవేళ, ఆకాష్ లాగా, మీరు కూడా SIPల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, మార్కెట్ పెరగడం లేదా తగ్గడం గురించి ఆందోళనపడకండి. మీ పెట్టుబడుల విషయంలో స్థిరంగా ఉండండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి