Nominee: మీరు నామినీ పేరును నమోదు చేశారా? లేకుంటే మీ అకౌంట్ క్లోజ్!

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నామినేషన్లపై కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం పరిస్థితి నిజంగా ఆందోళనకరంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల 64 లక్షల సింగిల్ డీమ్యాట్ ఖాతాల్లో, 9.9 కోట్ల అకౌంట్లలో నామినేషన్ల వివరాలే లేవు. ఇది మొత్తం డీమ్యాట్ ఖాతాల్లో 72.5 శాతం అంటే నమ్మగలరా! 9.51 కోట్లు, అంటే దాదాపు 70 శాతం డీమ్యాట్ హోల్డర్లు నామినీ వివరాలు ఇవ్వాలని తెలిసినా ఇవ్వలేదు. అయితే..

Nominee: మీరు నామినీ పేరును నమోదు చేశారా? లేకుంటే మీ అకౌంట్ క్లోజ్!
Nominee Name
Follow us

|

Updated on: Feb 21, 2024 | 8:03 PM

చాలా మంది వ్యక్తులు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు కానీ నామినేషన్ వివరాలను లైట్ తీసుకుంటారు. వారు నామినేషన్ల గురించి ప్రస్తావించరు. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ల గురించి SEBI రిపోర్ట్ ఏం చెబుతుందో చూద్దాం. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నామినేషన్లపై కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం పరిస్థితి నిజంగా ఆందోళనకరంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల 64 లక్షల సింగిల్ డీమ్యాట్ ఖాతాల్లో, 9.9 కోట్ల అకౌంట్లలో నామినేషన్ల వివరాలే లేవు. ఇది మొత్తం డీమ్యాట్ ఖాతాల్లో 72.5 శాతం అంటే నమ్మగలరా! 9.51 కోట్లు, అంటే దాదాపు 70 శాతం డీమ్యాట్ హోల్డర్లు నామినీ వివరాలు ఇవ్వాలని తెలిసినా ఇవ్వలేదు. అయితే 37 లక్షల 58 వేలు అంటే 2.75 శాతం డీమ్యాట్ ఖాతాదారులు డైలమాలో ఉన్నారు. వారు ఎవరినైనా నామినేట్ చేయాలా వద్దా.. ఈ రెండింటిలో ఏ ఆప్షనూ ఎంచుకోలేదు.

అదే విధంగా చూస్తే, 8.9 కోట్ల సింగిల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలలో, 7 కోట్ల 64 లక్షలు.. అంటే 85.8 శాతం పోర్టిఫోలియోలకు నామినేషన్లు ఉన్నాయి. అయితే 1.26 కోట్లు, అంటే దాదాపు 14.2 శాతం పోర్ట్‌ఫోలియోలు అనిశ్చితి వల్ల ఎవరినీ నామినేట్ చేయలేదు. అలాగని నామినేషన్ నుండి వైదొలగలేదు. డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్‌లు రెండింటికి చెందిన వారిలో ఎక్కువమంది .. నామినీ వివరాలను ఇవ్వాలన్న విషయం తెలిసి కూడా ఇవ్వలేదు. అంటే వారు నామినేషన్ల నుండి పక్కకు జరగలేదు. అలాగే ఎవరినైనా నామినేట్ చేయాలా వద్దా అనే అనుమానం ఉన్నవారు కూడా ఉన్నారు. అసలు ఈ పెట్టుబడి విధానాల్లో నామినేషన్ అనేది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు అర్థం చేసుకుందాం. నామినేషన్  అనేది మీరు మరణించిన సందర్భంలో మీ ఆస్తులను చూసుకునే వ్యక్తిని ఎంచుకునే ప్రక్రియ. నిబంధనల ప్రకారం.. కొత్త డీమ్యాట్ ఖాతాలు లేదా మ్యూచువల్ ఫండ్‌లకు నామినేషన్ తప్పనిసరి. మీరు ఎవరినీ నామినేట్ చేయకూడదనుకుంటే, మీరు ఫారమ్‌లో నామినేషన్ నుండి వైదొలిగే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇంతకు ముందు నామినేషన్  తప్పనిసరి కాదు. అందుకే చాలా మంది దీనిని దాటవేసి ముందుకు వెళ్లేవారు.

నామినీని జోడించడం చాలా ముఖ్యం. దీనివల్ల పెట్టుబడి పెట్టిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. తన ఫండ్స్ సులభంగా సరైనవారి చేతికి అందుతాయి. నామినీ చట్టబద్ధమైన వారసుడు లేదా సన్నిహిత వ్యక్తి అయినా కావచ్చు. నామినీ చట్టబద్ధమైన వారసుడు కాకపోతే, నామినీ ఆస్తులను లీగల్ గా వారసులైనవారికి ట్రాన్స్ ఫర్ చేయడానికి ఏజెంట్ గా లేదా ట్రస్టీగా వ్యవహరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో నామినీ లేనప్పుడు, చట్టపరమైన వారసులు లేదా హక్కుదారులు.. వీలునామా చట్టబద్దమైన వారసుడు అని తెలిపే సర్టిఫికేట్, ఇతర పిల్లల నుండి అభ్యంతరం లేదంటూ మరో సర్టిఫికేట్.. ఇలా వివిధ పత్రాలను అందించాలి. ఈ పత్రాలు వారి యూనిట్ల వాటాను బదిలీ చేయడానికి అవసరం. చాలా మంది పెట్టుబడిదారులు వీలునామా రాయరు. అటువంటప్పుడు, నామినీని నియమించకపోతే, మరణించిన పెట్టుబడిదారుడి కుటుంబం.. తాము చట్టబద్ధమైన వారసులమని నిరూపించడం తప్పనిసరి. కానీ ఇదంతా చేయడం నిజంగా చాలా కష్టమైన పని అవుతుంది.

ఇవి కూడా చదవండి

నిజం చెప్పాలంటే నామినేషన్ ప్రక్రియ చాలా సులభం. మ్యూచువల్ ఫండ్స్‌లో, ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో రెండు విధాలుగా నామినీలను యాడ్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్‌లో, మీరు నామినీ వివరాలను ఫారమ్‌లో పూరించి, ఫండ్ హౌస్‌కి సబ్ మిట్ చేయవచ్చు. అయితే, ఆన్‌లైన్ పద్ధతిలో, మీరు CAMS వెబ్‌సైట్ www.camsonline.comని సందర్శించాలి. ఎంఎఫ్ ఇన్వెస్టర్స్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నామినేట్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆపై, మీ పాన్ నెంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత, మీ మ్యూచువల్ ఫండ్స్ ఖాతా వివరాలు మీ ముందు కనిపిస్తాయి. మీరు ఖాతాపై క్లిక్ చేయడం ద్వారా నామినీలను నమోదు చేసుకోవచ్చు.. మార్చవచ్చు లేదా తొలగించవచ్చు. మీరు దీన్ని మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్ ద్వారా కూడా చేయవచ్చు.

డీమ్యాట్ ఖాతాలో నామినీని అప్‌డేట్ చేయడానికి, మీరు nsdl.co.inలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆపై, డీమ్యాట్ నామినేట్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి. DP ID, క్లయింట్ ID, PAN వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఆ తర్వాత, ఆధార్ OTPని ఉపయోగించి నామినీ వివరాలను ఫిల్ చేసి మీరు నామినేట్ చేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్లలో నామినేషన్ కోసం గడువు జూన్ 30, 2024 వరకు పొడిగించారు. మీరు ఇంకా దీన్ని చేయకుంటే, ఇప్పుడే చేయండి. లేకపోతే, మీ డీమ్యాట్ ఖాతా మూసేసే ఛాన్సుంది. అంతేకాకుండా, మీరు మ్యూచువల్ ఫండ్స్ నుండి డబ్బును విత్‌డ్రా చేయలేరు. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలు కాకుండా, బ్యాంక్ ఖాతాలు, ఎఫ్‌డిలు, ప్రావిడెంట్ ఫండ్‌లు, బీమా పాలసీలలో నామినీలను అప్‌డేట్ చేయండి. దిలీప్ తండ్రి చేసిన తప్పు మీరు చేయవద్దు. లేకపోతే మీరు లేనప్పుడు మీ డబ్బు కోసం మీ కుటుంబం ఇబ్బందులు పడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా