వ్యక్తి చనిపోతే అతని ఆధార్‌ ఏమవుతుంది? రద్దు చేయాలా? నిబంధనలేంటి?

22 July 2024

TV9 Telugu

ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది. 

ఆధార్ 

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డును ఏం చేయాలో? ఎప్పుడైనా ఆలోచించారా? మరణించిన వారి ఆధార్ కార్డును సరెండర్ చేయాలా? లేదా డీయాక్టివేట్ చేయాలా? తెలుసుకుందాం.

వ్యక్తి చనిపోయిన తర్వాత

కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత, మీరు అతని ఆధార్ కార్డును సరెండర్ గానీ రద్దు చేయలేరు. కానీ కార్డు సురక్షితంగా ఉండాలంటే యూఐడీఏఐ అందించే ఆధార్ లాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.

ఎవరైనా మరణిస్తే..

మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అతని/ఆమె ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు.

మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే

ఆధార్‌ను లాక్ చేయడానికి ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి. ఆ తర్వాత మై ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

ఆధార్ కార్డును లాక్ చేయడమేలా..

అనంతరం మై ఆధార్‌లోని ఆధార్ సేవలకు వెళ్లి, ‘లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్’ ఎంపికను ఎంచుకోవాలి. దీని తర్వాత స్క్రీన్‌పై కొత్త పేజీ వస్తుంది. 

ఆధార్ కార్డు లాక్

ఈ కొత్త పేజీలో లాగిన్ అవ్వడానికి మీరు లాక్ చేయాలనుకుంటున్న 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

ఆధార్ కార్డు లాక్

ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీను పూరించాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ నుండి లాక్ ఎంపికను ఎంచుకుంటే ఆధార్ కార్డు లాక్ అవుతుంది. 

ఆధార్ కార్డు లాక్