ITR Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడవు జూలై 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత ఆదాయం దాటిన చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. ముఖ్యంగా లాస్ట్ డేట్ సమయంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే చాలా మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది రీఫండ్ బ్యాంకు ఖాతాలో జమైన కొంత మందికి మాత్రం జమ కాలేదు.

ITR Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
Income Tax
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 5:00 PM

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడవు జూలై 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత ఆదాయం దాటిన చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. ముఖ్యంగా లాస్ట్ డేట్ సమయంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే చాలా మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది రీఫండ్ బ్యాంకు ఖాతాలో జమైన కొంత మందికి మాత్రం జమ కాలేదు. అయితే ఐటీ రీఫండ్ పొందాలంటే మీ ఐటీఆర్ తప్పనిసరిగా ఈ-వెరిఫై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారుల ఖాతాలో రీఫండ్ జమ కావడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది. అయితే, ఈ వ్యవధిలో రీఫండ్ అందకపోతే పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌లో వ్యత్యాసాలకు సంబంధించిన సమాచారం కోసం తనిఖీ చేయాలి. ఈ నేపథ్యంలో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ తనిఖీ ఎలా చేయాలో? ఓసారి తెలుసుకుందాం.

ఐటీఆర్ రీఫండ్ తనిఖీ ఇలా

  • మీ ఐటీఆర్ స్టేటస్ తనికీ చేయాలంటే మీ పాన్ నెంబర్ తప్పనిసరిగా మీ ఆధార్‌తో లింక్ చేయబడి ఉండాలి. అలాగే మీ ఐటీఆర్ రసీదు సంఖ్య అవసరం అవుతుంది.
  • ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. 
  • అక్కడ ఈ-ఫైల్ ట్యాబ్‌కు వెళ్లి,  ఆపై ‘ఆదాయ పన్ను రిటర్న్స్’, ‘ఫైల్డ్ రిటర్న్స్’పై క్లిక్ చేయాలి.
  • అనంతరం అసెస్‌మెంట్ సంవత్సరం ఎంచుకుని రీఫండ్ స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎన్ఎస్‌డీఎల్ ద్వారా తనిఖీ ఇలా

మీరు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో మీ ఐటీఆర్ రీఫండ్ స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ పాన్‌ను నమోదు చేసి, అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. అనంతరం ‘క్యాప్చా కోడ్’ని నమోదు చేసి  ‘ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!
మద్యం ప్రియులకు చేదు వార్త.. 2 రోజులు షాపులు బంద్
మద్యం ప్రియులకు చేదు వార్త.. 2 రోజులు షాపులు బంద్
ఆడబిడ్డల కోసం అద్భుతమైన స్కీమ్.. పెళ్లి నాటికి రూ. 22.5లక్షలు
ఆడబిడ్డల కోసం అద్భుతమైన స్కీమ్.. పెళ్లి నాటికి రూ. 22.5లక్షలు
వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు
వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు
సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కొక్కటి దివ్యాస్త్రమే..
సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కొక్కటి దివ్యాస్త్రమే..
బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్‌. రోజూ పరగడుపున తాగాలి
బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్‌. రోజూ పరగడుపున తాగాలి
'వచ్చే 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేస్తాం..' సీఎం రేవంత్‌
'వచ్చే 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేస్తాం..' సీఎం రేవంత్‌