ఏపీకి వందేభారత్ స్లీపర్ వచ్చేది అప్పుడే.. రూట్ ఇదే
Ravi Kiran
27 JULY 2024
ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. ఢిల్లీ-ముంబై మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.
వందేభారత్ స్లీపర్ రైలు నిర్మాణ పనులు బెంగుళూరులో శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని టాక్.
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో థర్డ్ ఏసీకి 10 కోచ్‌లు, సెకండ్ ఏసీకి 4 కోచ్‌లు, ఫస్ట్ ఏసీకి ఒక కోచ్‌లు కేటాయిస్తారట
వందే భారత్ స్లీపర్ రైలులో 2 సీటింగ్ కమ్ లగేజ్ ర్యాక్(SLR) కోచ్‌లు కూడా ఉంటాయి. ఈ రైలు మొదటి దశలో గంటకు 130 కి.మీ వేగంతో నడుస్తుంది.
ఢిల్లీ-ముంబై మార్గం చాలా రద్దీగా ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువ.. అలాగే వ్యాపారులు కూడా ఎక్కువగానే ఉంటారు.
ఇక నెక్స్ట్ వందేభారత్ స్లీపర్ ట్రైన్.. సికింద్రాబాద్-ముంబై మధ్య పరుగులు పెడుతుందని తెలుస్తోంది. ఈ ట్రైన్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
అటు సికింద్రాబాద్-పూణే మధ్య పగటిపూట నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతుందని తెలుస్తోంది.
మరోవైపు మైసూరు-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన తీసుకొచ్చింది భారత రైల్వే శాఖ. దీని కోసం భూములను సేకరించే పనిలో పడిందని సమాచారం.