Multibagger Stock: ఏడాదిలోనే పెట్టుబడి రెట్టింపు.. రాకెట్‌లా దూసుకపోతోన్న మల్టీబ్యాగర్ స్టాక్..
కొన్ని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా..
కరోనా మహమ్మారితో స్టాక్ మార్కెట్(Stock Market) నష్టాల్లో ఉన్నా, గత ఒకటిన్నర సంవత్సరాలలో చాలా స్టాక్‌లు భారీ లాభాలు అందించాయి. చాలా స్టాక్స్ కొన్ని నెలల్లో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. పెన్సీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తోనే ముడిపడి ఉంటుంది. మార్కెట్ నష్టాల్లోకి జారితే.. ఈ స్టాక్స్‌లో కూడా భారీ పతనం ఉంటుంది. కానీ.. మార్కెట్‌ను గమనిస్తూ..పెట్టబడి పెట్టవారికి మాత్రం ఊహించని లాభాలు సొంతమవుతాయి. కొన్ని స్టాక్స్ స్వల్పకాలంలోనే మంచి లాభాలను అందిస్తుంటాయి. ఇలాంటి వాటిలో చాలానే స్టాక్స్ ఉన్నాయి. అందులో ఎల్‌జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ లిమిటెడ్ స్టాక్ కూడా ఒకటి. ఏడాది పొడవునా, ఈ స్టాక్ ధర (LGB Stock Price) 114 శాతం పెరిగి రూ.293 నుంచి రూ.627కి చేరుకుంది. ఈ విధంగా, ఈ స్టాక్ తన పెట్టుబడిదారుల పెట్టుబడిని ఒక సంవత్సరంలో రెట్టింపు చేసింది.
గత 10 ఏళ్లలో స్టాక్ ఎంత పెరిగిందంటే?
కంపెనీ షేరు ధరలో ఇంత భారీ పెరుగుదల కనిపించడం ఇదే తొలిసారి కాదు. గత 10 ఏళ్లలో కంపెనీ షేరు 700 శాతం వరకు పెరిగింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులకు విపరీతమైన లాభాలను అందించింది.
ఏడాది క్రితం రూ. 1 లక్ష..
ఒక సంవత్సరం క్రితం ఒక వ్యక్తి ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, అతని పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ. 2.14 లక్షలకు చేరుకుంది.
ఇది కంపెనీ మార్కెట్ క్యాప్..
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (LGB M-Cap) రూ.1,928 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ ఐదు రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల చలన సగటుల కంటే ఎక్కువగా ఉంది.
బ్రోకరేజ్ హౌస్ ఏం చెబుతుందంటే?
మార్కెట్‌లో నాయకత్వ స్థానం, గత రెండు త్రైమాసికాల అద్భుతమైన ఫలితాలు కారణంగా కంపెనీ చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారిందని గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివం శర్మ తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో మేనేజ్‌మెంట్ తన ఉత్పత్తుల శ్రేణిని పెంచుతున్నట్లు, ప్రస్తుత వాల్యుయేషన్ స్థాయి చాలా ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో ఆటోమోటివ్ చైన్ మార్కెట్‌లో ఎల్‌జీబీబీకి బలమైన స్థానం ఉందని బ్రోకరేజ్ హౌస్ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Also Read: Petrol Diesel Price: వాహనదారులకు చల్ల చల్లని వార్త.. ఎనిమిదో రోజు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు..