Mukesh Ambani: ఇక బిస్కెట్ల వ్యాపారంలోకి అంబానీ గ్రూప్.. మార్కెట్లోకి 9 కొత్త రకాలు..!

Reliance Biscuit: భారతదేశంలోని బిస్కెట్ మార్కెట్‌లో ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూప్ కూడా మార్కెట్లోకి ప్రవేశించింది. దీని కారణంగా భారతీయ బిస్కెట్ మార్కెట్ చాలా పోటీగా మారింది. ముఖ్యంగా, 2024 ఆర్థిక సంవత్సరంలో..

Mukesh Ambani: ఇక బిస్కెట్ల వ్యాపారంలోకి అంబానీ గ్రూప్.. మార్కెట్లోకి 9 కొత్త రకాలు..!
Independence Biscuit

Updated on: Nov 13, 2026 | 1:27 PM

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. అలాగే భారతదేశంలో నంబర్ 1 ధనవంతుడు. అతని కుటుంబ నికర ఆస్తి విలువ సుమారు 88.8 మిలియన్ అమెరికన్ డాలర్లు. ముఖేష్ అంబానీ కుటుంబం ఇప్పటికే రిలయన్స్ వంటి కంపెనీల ద్వారా వివిధ రంగాలలో వ్యాపారం చేస్తోంది. కానీ ఇప్పుడు ఒక కొత్త రంగంలోకి ప్రవేశించింది. అంబానీ గ్రూప్ ఇప్పుడు బిస్కెట్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల క్యాంపా కోలాతో శీతల పానీయాల పరిశ్రమలోకి ప్రవేశించింది. దాని తర్వాత ఇప్పుడు బిస్కెట్ల పరిశ్రమలోకి కూడా ప్రవేశించాలని యోచిస్తోంది. అదేంటంటే, అంబానీ గ్రూప్ ‘ ఇండిపెండెన్స్’ బ్రాండ్ క్రింద 9 కొత్త రకాల బిస్కెట్లను విడుదల చేయబోతోంది. ఈ బిస్కెట్లను మొదటి దశలో తమిళనాడులో అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఈ బిస్కెట్లు భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ బిస్కెట్లను 5, 10, 40, 125 రూపాయల వివిధ ధరలలో విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Rate: భారీ పతనం.. రూ.10 వేలు తగ్గిన బంగారం ధర.. కుప్పకూలుతున్న వెండి

అనేక రకాల బిస్కెట్లు..

రిలయన్స్ తన కొత్త బిస్కెట్లను పలు రకాల్లో విడుదల చేసింది. వాటిలో పవర్ అప్, బటర్ బ్లిస్, మిల్కీ పవర్, మేరీ ప్రైమ్ వంటి రెగ్యులర్ బిస్కెట్లు, అలాగే కోకో, వనిల్లా, చాక్లెట్ క్రీమ్ యమ్ ఆరెంజ్, చాక్లెట్ క్రీమ్ యమ్ చోకో వంటి క్రీమ్ బిస్కెట్లు, ఇలా మొత్తం 9 రకాల బిస్కెట్లు ఉన్నాయి.

 

బిస్కెట్ మార్కెట్ విలువ

భారతదేశంలోని బిస్కెట్ మార్కెట్‌లో ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూప్ కూడా మార్కెట్లోకి ప్రవేశించింది. దీని కారణంగా భారతీయ బిస్కెట్ మార్కెట్ చాలా పోటీగా మారింది. ముఖ్యంగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 55,100 కోట్లుగా ఉన్న బిస్కెట్ మార్కెట్ విలువ, 2029 నాటికి రూ. 90,300 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత ప్రజలలో బిస్కెట్ల వినియోగం అధికంగా ఉండటం వల్ల, కంపెనీలు వరుసగా బిస్కెట్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నాయనేది గమనార్హం.

ఇది కూడా చదవండి: Poultry Farming: కోడి గుడ్డులో పిల్ల ఉందా? లేదా? 21 రోజులకు ముందు కనిపెట్టే సింపుల్‌ ట్రిక్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us