అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్.. కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి!
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్య మదింపు కమిటీ ఆమోదించింది. అయితే మూడు ప్రధానమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో నాలుగు ప్యాకేజీల్లో ఓఆర్ఆర్ ను నిర్మించాలని ఎన్ హెచ్ ఏ ఐ ప్రతిపాదించింది. అయితే దీన్ని నాలుగు ప్యాకేజీల్లో కాకుండా రెండు ప్యాకేజీల్లోనే నిర్మించాలని కమిటి నిర్ణయించింది.

అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్య మదింపు కమిటీ ఆమోదించింది. అయితే మూడు ప్రధానమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో నాలుగు ప్యాకేజీల్లో ఓఆర్ఆర్ ను నిర్మించాలని ఎన్ హెచ్ ఏ ఐ ప్రతిపాదించింది. అయితే దీన్ని నాలుగు ప్యాకేజీల్లో కాకుండా రెండు ప్యాకేజీల్లోనే నిర్మించాలని కమిటి నిర్ణయించింది. మొదటి ప్యాకేజీ హైవే నంబర్ 65 వద్ద నున్న కంచిక చర్ల నుండి కంకిపాడు మండలం చలివేంద్రపాడు వద్ద నున్న అదే హైవే నంబర్ 65 వరకూ నిర్మిస్తారు. మొత్తం 86 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజ్ లో నిర్మిస్తారు. ఇక రెండో ప్యాకేజీలో భాగంగా 109 కిలో మీటర్ల మేర నిర్మాణం చేస్తారు. రెండు ప్యాకేజ్ లో భాగంగానే క్రిష్ణా నదిపై వంతెనల నిర్మాణం ఉంటుంది. మొత్తం ఓ ఆర్ ఆర్ 189.93 కిలో మీటర్లు కాగా నారాకోడూరు నుండి బుడంపాడు హైవే వరకూ 5.2 కిలో మీటర్ల నాలుగు వరుసల అనుసంధాన రహదారితో కలుపుకొని మొత్తం 195.13 కిలో మీటర్ల దూరం ఉంటుంది.
హ్యామ్ కు బదులుగా బివోటి పద్దతి..
గతంలో ఓ ఆర్ ఆర్ ను హ్యామ్ మోడల్ నిర్మించాలని ప్రతిపాదించారు. హైబ్రీడ్ యాన్యూటీ మోడల్ అంటే హ్యామ్ కు బదులుగా బివోటి పద్ధతిలోనే నిర్మించాలని నిర్ణయించారు. బివోటి అంటే బిల్డ్, ఆర్గనైజ్, ట్రాన్స్ఫర్ పద్దతి. నిర్మించు, నిర్వహించు, బదలాయించు పద్దతిలో కూడా రెండు రకాలుంటాయి. మొదటిది నిర్మాణ ఖర్చును టోల్ వసూలు ద్వారా కాంట్రాక్టర్ తీసుకోవచ్చు. ఇందుకు పదిహేను నుండి ఇరవై ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక రెండో పద్దతిలో ప్రతి ఏటా టోల్ వసూలు ద్వార ఎంత వస్తుందో లెక్కించి మొత్తం ఖర్చు కంటే తక్కువుగా ఉంటే దాన్ని ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టర్ కు ఇస్తుంది. ఈ రెండు పద్దతుల్లో ఏదో ఒక దానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బివోటి పద్ధతిలోనే నిర్మించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య మదింపు కమిటీ అనుమతి కూడా రావడంతో ఇక కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ మాత్రమే మిగిలి ఉంది. గతంలో నాలుగు ప్యాకేజీల్లో భాగంగా పిలిచిన టెండర్ల గడవు ఈ నెల 18తో ముగియనుంది. అయితే రెండు ప్యాకేజీల్లో నిర్మాణానికి అనుగుణంగా టెండర్లలో మార్పు చేసి గడువు పొడిగిస్తారు. కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ అయితే ఒక వైపు టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే భూ సేకరణ కూడా చేస్తారు.
త్వరలోనే ఓఆర్ఆర్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఓఆర్ఆర్ కూ అన్ని అనుమతులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
