Mukesh Ambani: ముఖేష్ అంబానీ రూ. 41,706 కోట్లు నష్టపోయారు.. ఇతర కంపెనీలకు కూడా తీవ్ర నష్టం

|

Oct 02, 2022 | 8:18 PM

సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీలలో 7 మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో క్షీణించింది. గత వారంలో ఈ 7 కంపెనీల మార్కెట్ క్యాప్..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ రూ. 41,706 కోట్లు నష్టపోయారు.. ఇతర కంపెనీలకు కూడా తీవ్ర నష్టం
Mukesh Ambani
Follow us on

సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీలలో 7 మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో క్షీణించింది. గత వారంలో ఈ 7 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,16,053.13 కోట్లు తగ్గింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అతిపెద్ద క్షీణత కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం మార్కెట్ విలువలో రూ.41,706.05 కోట్ల నష్టాన్ని చవిచూసింది. BSE స్టాండర్డ్ ఇండెక్స్ సెన్సెక్స్ గత వారంలో 672 పాయింట్లు లేదా 1.15 శాతం నష్టపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ కంపెనీలకు నష్టం:

టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి గత వారంలో నష్టాల్లో ఉన్నాయి. అదే సమయంలో మార్కెట్ విలువ పరంగా TCS, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్‌లకు గత వారం లాభదాయకంగా ఉంది. అయితే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం మార్కెట్ వాల్యుయేషన్‌లో రూ.41,706.05 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వారం చివరి నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,08,601.05 కోట్లకు తగ్గింది. అదే సమయంలో, SBI మార్కెట్ విలువ రూ.17,313.74 కోట్లు తగ్గి రూ.4,73,941.51 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.13,806.39 కోట్లు తగ్గి రూ.6,01,156.60 కోట్లకు చేరింది. అలాగే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాల్యుయేషన్ రూ.13,423.6 కోట్లు తగ్గి రూ.7,92,270.97 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ వాల్యుయేషన్ రూ.10,830.97 కోట్లు తగ్గి రూ.4,16,077.03 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, బజాజ్ ఫైనాన్స్ వాల్యుయేషన్ రూ.10,240.83 కోట్లు తగ్గి రూ.4,44,236.73 కోట్లకు చేరుకుంది. కాగా, భారతీ ఎయిర్‌టెల్ వాల్యుయేషన్ కూడా గత వారం రూ.8,731.55 కోట్లు క్షీణించి రూ.4,44,919.45 కోట్లుగా ఉంది.

ఈ కంపెనీలు లాభపడ్డాయి:

అయితే ఈ వారం ఇన్ఫోసిస్ వాల్యుయేషన్‌లో రూ.20,144.57 కోట్లు పెరిగి, మొత్తం రూ.5,94,608.11 కోట్లకు చేరుకుంది. మరో ఐటీ కంపెనీ టీసీఎస్ వాల్యుయేషన్ కూడా రూ.7,976.74 కోట్లు పెరిగి రూ.10,99,398.58 కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.4,123.53 కోట్లు పెరిగి రూ.6,33,649.52 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంక్, HUL, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, SBI, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, HDFC ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి