ఇండియాలో టాప్ 10 ధనవంతులు వీళ్లే..! లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు..
M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ముఖేష్ అంబానీ రూ.9.55 లక్షల కోట్లతో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రా టాప్-3లోకి ప్రవేశించి, భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు.

మన దేశంలో పేదరికం ఉన్నప్పటికీ.. ప్రపంచ జాబితాలో నిలిచే అపర కుబేరులూ ఉన్నారు. అయితే ఇండియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. M3M ఇండియా, హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా విడుదల చేసిన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ, అతని కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండో స్థానంలో ఉన్నారు.
హురున్ రిచ్ ఇండియన్ జాబితాలో మూడవ స్థానంలో ఆశ్చర్యకరమైన పేరు వెలువడింది. HCL టెక్నాలజీస్‌కు చెందిన రోషని నాడార్ మల్హోత్రా, కుటుంబం తొలిసారిగా టాప్-3లో చోటు దక్కించుకున్నారు. ఆ కుటుంబ ఆస్తుల విలువ రూ.2.84 లక్షల కోట్లు. దీనితో రోషని నాడార్ భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా అవతరించారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 టాప్ 10
- ముఖేష్ అంబానీ కుటుంబం: రూ. 9.55 లక్షల కోట్లు
- గౌతమ్ అదానీ కుటుంబం: రూ. 8.14 లక్షల కోట్లు
- రోష్ని నాడర్ మల్హోత్రా కుటుంబం: రూ. 2.84 లక్షల కోట్లు
- సైరస్ పూనవాలా కుటుంబం: రూ. 2.46 లక్షల కోట్లు
- కుమారమంగళం బిర్లా కుటుంబం: రూ. 2.32 లక్షల కోట్లు
- నీరజ్ బజాజ్ కుటుంబం: రూ. 2.32 లక్షల కోట్లు
- దిలీప్ సంఘవి: రూ. 2.30 లక్షల కోట్లు
- అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం: రూ. 2.21 లక్షల కోట్లు
- గోపీచంద్ హిందూజా కుటుంబం: రూ. 1.85 లక్షల కోట్లు
- రాధాకిషన్ దమానీ కుటుంబం: రూ. 1.82 లక్షల కోట్లు
పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ రూ.43,640 కోట్ల నికర విలువతో 57వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. మేఘా ఇంజనీరింగ్‌కు చెందిన పి పిచ్చి రెడ్డి, పివి కృష్ణ రెడ్డి వరుసగా 60వ, 62వ స్థానాల్లో ఉన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
