Budget 2024: పెరగనున్న ముద్ర లోన్ లిమిట్! బడ్జెట్‌పై ఎంఎస్ఎంఈ రంగం ఆశలు..

|

Jul 20, 2024 | 3:51 PM

ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 10లక్షల వరకూ రుణాన్ని అందిస్తున్నారు. అయితే ఈ రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్న డిమాండ్‌ ఉంది. దీంతో పాటు పలు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్‌కు ముందు నిపుణులు తమ సూచనలలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం దాని అజెండాలో కొన్ని అంశాలను చేర్చవలసి ఉంటుందని పేర్కొన్నారు.

Budget 2024: పెరగనున్న ముద్ర లోన్ లిమిట్! బడ్జెట్‌పై ఎంఎస్ఎంఈ రంగం ఆశలు..
Money
Follow us on

బడ్జెట్ సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలై 23న కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బడ్జెట్-2024లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కూడా ప్రత్యేక అంచనాలను కలిగి ఉన్నాయి. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 10లక్షల వరకూ రుణాన్ని అందిస్తున్నారు. అయితే ఈ రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్న డిమాండ్‌ ఉంది. దీంతో పాటు పలు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్‌కు ముందు నిపుణులు తమ సూచనలలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం దాని అజెండాలో కొన్ని అంశాలను చేర్చవలసి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిమాండ్ ఏమిటి?

ప్రస్తుతం ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రుణ పరిమితి రూ. 10 లక్షలు. దీన్ని పెంచాలన్న డిమాండ్ ఉంది. దీనితో పాటు, ఎంఎస్ఎంఈలకు సురక్షితం కాదని భావించే రుణాల క్రెడిట్ గ్యారెంటీ కవర్‌ను కూడా పెంచాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం క్రెడిట్ గ్యారెంటీ కవర్ రూ.2 కోట్లు ఉంది. దీనిని రూ. 5 కోట్లకు పెంచాలన్న డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకోవాలని, తద్వారా ఎంఎస్ఎంఈలు మరిన్ని ఆర్థిక వనరులను పొందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో దాని సహకారాన్ని కూడా పెంచవచ్చని పేర్కొంటున్నారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక ముఖ్యమైన విధానాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. దీంతో పాటు ఈ బడ్జెట్ ఎంఎస్ఎంఈల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్ నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందుతాయని నిపుణులు ఆశిస్తున్నారు.

ముద్ర లోన్ అంటే..

కేంద్ర ప్రభుత్వం యువతను వ్యాపార వేత్తలుగా మలిచేందుకు ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా చేస్తోంది. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువతకు అండగా ఉంటుంది. వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహాన్ని రుణం రూపంలో అందిస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే రూ. 10లక్షల వరకూ రుణం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..