Pan Card 2.0
పాన్ కార్డును నవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాన్ 2.0 అనే ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఆర్థిక మోసాలను అరికట్టడం, సమాచార తస్కరణను నియంత్రించడం, సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు. పాన్ 2.0 ప్రాజెక్టు కోసం కేంద్ర క్యాబినేట్ రూ.1,435 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. పాన్, టాన్ సేవలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ విధానం దోహద పడుతుంది. అయితే పాన్ 2.0 ఎప్పుడు అమల్లోకి వస్తోంది కచ్చితమైన సమాచారం లేదు. కాగా.. పాన్ 2.0 ప్రాజెక్టులో కొత్త పాన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ విధానంలో క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులను జారీ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ పాత కార్డులోని చిరునామాను కొత్త కార్డులోకి అప్ డేట్ చేసుకోవాలి. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కార్డు నంబర్లు ఏమాత్రం మారవు. పాత నంబర్లే కంటిన్యూ అవుతాయి.
పాన్ కార్డ్ 2.0 ఉపయోగాలివే
- ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం పాన్ 2.0 ప్రదాన ఉద్దేశం. దీని ద్వారా పాన్ , టాన్ సేవలను ఒక పోర్టల్ లో యాక్సెస్ చేయవచ్చు.
- పేపర్ లెస్ ప్రక్రియలు, ఉచిత ఇ-పాన్ సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఖర్చు లేకుండా ఇ-పాన్ ను ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. కానీ భౌతికంగా చేతికి రావాలంటే మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి.
- కార్డు దారుడి సమాచారం కొత్త పాన్ కార్డు ద్వారా మరింత భద్రంగా ఉంటుంది. డూప్లికేట్ కార్డులను నిరోధిస్తుంది.
- ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి హెల్ప్ డెస్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
- పాన్ కార్డులో డేటాకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఫీచర్ ను నవీకరించారు. పాత కార్డులున్నవారు కొత్త క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులను తీసుకోవచ్చు.
- పాన్ 2.0 కార్డు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. డేటా భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.
- ఇప్పటికే ఉన్న పాన్ కార్డు హోల్డర్లు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోంటే కొత్ ఇ-పాన్ ను మంజూరు చేస్తారు.
- పాన్ 2.0 ప్రాజెక్టులో పాన్ కార్డులు క్యూఆర్ కోడ్ తో వస్తాయి. అయితే 2017-18 నుంచి జారీ చేస్తున్న కార్డులన్నింటిపైనా క్యూాఆర్ కోడ్ ఉంటోంది. దాన్ని స్కాన్ చేస్తే డేటా బేస్ లోని అన్ని వివరాలు కనిపిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి