PM Kisan Tractor Yojana: రైతులు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చా?.. ఇందులో నిజమెంత అంటే..Fact Check

| Edited By: Shiva Prajapati

Oct 28, 2021 | 6:59 PM

రైతుల ఆదాయాన్ని పెంచడానికి..ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలు తీసుకొచ్చింది.

PM Kisan Tractor Yojana: రైతులు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చా?.. ఇందులో నిజమెంత అంటే..Fact Check
Pm Kisan Tractor Yojana
Follow us on

PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని పెంచడానికి..ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలు తీసుకొచ్చింది. పీఎం కిసాన్ యోజన కింద అతని ఖాతాలో ఏటా 6000 రూపాయలు జమ అవుతుంది. విత్తనాలు, ఎరువులు, అనేక రకాల యంత్రాలపై రాయితీలు ఇస్తారు. రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇలా రైతులకు ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన తీసుకువచ్చినట్లు సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరిగింది.

అసలు ఈ వార్తలో నిజం ఏంటంటే..

ఈ పథకం గురించి జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదే అని తేలింది. పీఎం కిసాన్ యోజన కింద రైతుల  ఖాతాలో ఏటా 6000 రూపాయలు జమ అవుతుందని, విత్తనాలు, ఎరువులు, అనేక రకాల యంత్రాలపై భారీగా రాయితీలు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల మేర సబ్సిడీ ఇస్తుందన్నది అవాస్తవం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. అలాంటి పథకమేమీ లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ కూడా క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ఏమీ పెట్టలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. ప్రచారంలో ఉన్న ఫేక్ వివరాలను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి: PM Modi: భారత్-ఆసియాన్ 18వ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. ఆసియా దేశాలతో సామరస్యమే ఎజెండా!

Air India: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై విమానం ఎక్కాలంటే.. ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలి!

WhatsApp: వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..త్వరలో మీరు ఇలా చేయాల్సిందే!