Indian Railways: తొలి ట్రైన్ ఆలస్యం వల్ల తర్వాతి రైలు మిస్సయితే రీఫండ్ వస్తుందా..? రైల్వే రూల్స్ ఇవే..

రైలు ఆలస్యం కావడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. రైలు ఆలస్యం కారణంగా ఒక ప్రయాణికుడు తదుపరి రైలును కోల్పోతే రిఫండ్ పొందవచ్చు. ఇందుకోసం రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొంచింది. ఇంతకు రీఫండ్ ఎలా పొందాలనే విషయాలు ఇందులో చూద్దాం.

Indian Railways: తొలి ట్రైన్ ఆలస్యం వల్ల తర్వాతి రైలు మిస్సయితే రీఫండ్ వస్తుందా..? రైల్వే రూల్స్ ఇవే..
Indian Railways

Updated on: Jul 06, 2026 | 10:10 PM

భారత్‌లో రైళ్ల ప్రయాణం చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ట్రైన్ ప్రయాణం చాలా తక్కుక ఖర్చుతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ట్రైన్లు ఆలస్యం కావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులు తాము అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇక ఇతర స్టేషన్లలో కనెక్టింగ్ రైళ్లు ఉన్నవారు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటారు. మొదటి రైలు ఆలస్యం కారణంగా ఆ తర్వాత వెళ్లాల్సిన రైలును కోల్పోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో రైల్వేశాఖ టికెట్ డబ్బులు రీఫండ్ ఇస్తుందా.. లేదా అనేది చూద్దాం.

ఒకవేళ తొలుత ప్రయాణించిన రైలు ఆలస్యమై తర్వాతి రైలును కోల్పోతే ప్రయాణికులు తమ డబ్బును నష్టపోరు. సులభంగా రీఫండ్ పొందేందుకు వీలుగా భారతీయ రైల్వే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించింది. అయితే నిబంధన ప్రకారం మీకు పూర్తి డబ్బు వాపసు ఇవ్వబడుతుంది. అయితే మీరు కొన్ని షరతులను తప్పక పాటించాలి. అవేంటి అనేది చూద్దాం.

కండీషన్స్ ఇవే..

-రెండవ రైలుకు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు మీరు ‘రైళ్లు’ మెనూ కింద ఉన్న ‘కనెక్టింగ్ జర్నీ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మొదటి రైలు PNR నంబర్‌ను నమోదు చేయాలి. దీనివల్ల రైల్వేశాక రెండు ప్రయాణాలను ఒకే అనుసంధాన ప్రయాణంగా పరిగణిస్తుంది.

-మొదటి రైలు గమ్యస్థాన స్టేషన్, రెండవ రైలు ఎక్కే స్టేషన్ ఒకటే అయి ఉండాలి. లేదా అవి సాంకేతికంగా అనుసంధానించబడిన సమీప స్టేషన్లు అయి ఉండాలి.

-రెండు రైళ్ల షెడ్యూల్ సమయాల మధ్య కనీసం 20 నిమిషాలు, గరిష్టంగా 5 రోజుల వ్యత్యాసం ఉండాలి

-రీఫండ్ కోసం వెంటనే అప్లై చేసుకోవాలి. తొలి రైలు స్టేషన్‌కు వచ్చిన మూడు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మీరు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో DTR (టికెట్ డిపాజిట్ రసీదు)ను పూర్తి చేయడం ద్వారా రీఫండ్ పొందవచ్చు. మూడు గంటల గడువు తర్వాత చేసిన దరఖాస్తులు అంగీకరించబడవు.

TDRను ఎలా ఫైల్ చేయాలి..?

-IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అవ్వండి

-‘నా ఖాతా’ విభాగానికి వెళ్లి ‘నా లావాదేవీ’పై క్లిక్ చేయండి

-ఇక్కడ మీకు ‘File TDR’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఎంచుకోండి

-PNR నంబర్ నమోదు చేసి టిక్కెట్‌ను ఎంచుకోండి

-రీఫండ్ కోసం సరైన కారణాన్ని ఎంచుకోండి

-అనంతరం మీ డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది

Follow Us