AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్షోభంలో సాఫ్ట్‌వేర్.. ప్రమాదంలో మైక్రోసాఫ్ట్, మెటాకు చెందిన 23,000 మంది ఉద్యోగులు!

టెక్ ప్రపంచంలో అగ్రగామి సంస్థలైన మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫామ్స్ తీసుకున్న తాజా నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం మారనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల కొంపముంచుతోంది. ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులు, పెరిగిన వ్యయాలు ఈ సంస్థలను కఠిన నిర్ణయాల దిశగా నడిపించాయి.

సంక్షోభంలో సాఫ్ట్‌వేర్.. ప్రమాదంలో మైక్రోసాఫ్ట్, మెటాకు చెందిన 23,000 మంది ఉద్యోగులు!
Microsoft And Meta Plans Threaten Jobs
Balaraju Goud
|

Updated on: Apr 24, 2026 | 7:56 AM

Share

టెక్ ప్రపంచంలో అగ్రగామి సంస్థలైన మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫామ్స్ తీసుకున్న తాజా నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం మారనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల కొంపముంచుతోంది. ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులు, పెరిగిన వ్యయాలు ఈ సంస్థలను కఠిన నిర్ణయాల దిశగా నడిపించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు దిగ్గజ సంస్థలు సుమారు 23,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే ప్రణాళికలను రూపొందించాయి.

సోషల్ మీడియా దిగ్గజం మెటా తన అంతర్గత మెమోలో ఈ ప్రకటన చేసింది. సంస్థలోని మొత్తం సిబ్బందిలో 10 శాతం అంటే సుమారు 8,000 మందిని తొలగించనున్నట్లు పేర్కొంది. మే 20 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియతో పాటు, సంస్థలోని 6,000 ఖాళీలను కూడా భర్తీ చేయకూడదని నిర్ణయించుకుంది. కంపెనీని మరింత సమర్థవంతంగా, చురుకుగా మార్చే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెటా స్పష్టం చేసింది. మరోవైపు, మైక్రోసాఫ్ట్ తన అమెరికా ఉద్యోగుల కోసం భారీ స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Buyouts) పథకాన్ని ప్రకటించింది. అమెరికాలోని 1.25 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు 7 శాతం మంది, అంటే 8,750 మంది ఈ ఆఫర్‌కు అర్హులుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బైఅవుట్ కార్యక్రమంగా నిలవనుంది.

ప్రస్తుతం టెక్ రంగం మొత్తం AI మంత్రం జపిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాల్లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతోంది. మెటా సైతం ఏఐ భాగస్వామ్యాల కోసం రికార్డు స్థాయి వ్యయం చేస్తోంది. AI ద్వారా పెట్టుబడుల భారం తగ్గించుకోవాలని దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ మేధ కోసం చేస్తున్న భారీ ఖర్చులను సమతుల్యం చేయడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాగే తక్కువ మానవ వనరులతో సాంకేతికత ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించాలని సాఫ్ట్‌వేర్ సంస్థలు భావిస్తున్నాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థలను పునర్నిర్మించాలనుకుంటున్నాయి. టెక్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం, కంపెనీలు ఇప్పుడు మనుషుల కంటే మెషీన్ లెర్నింగ్, ఏఐ మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో టెక్ రంగంలో మరిన్ని ఉద్యోగ కోతలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది..
భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది..
విండీస్‌తో వన్డే సిరీస్.. ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్‌లు రీఎంట్రీ?
విండీస్‌తో వన్డే సిరీస్.. ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్‌లు రీఎంట్రీ?
అయ్యో డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్
అయ్యో డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్
విమానంలో ఇంటి భోజనం.. జంటను చూసి అంతా షాక్!
విమానంలో ఇంటి భోజనం.. జంటను చూసి అంతా షాక్!
మీ క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ వెనుక ఇంత తతంగం ఉందా? ఎవరికి ఎంత?
మీ క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ వెనుక ఇంత తతంగం ఉందా? ఎవరికి ఎంత?
కాళ్లలో ఉన్నట్టుండి నొప్పిగా ఉంటోందా?.. అసలు సమస్య ఇదే!
కాళ్లలో ఉన్నట్టుండి నొప్పిగా ఉంటోందా?.. అసలు సమస్య ఇదే!
నీళ్లు తాగినా దాహం తీరడం లేదా?.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు!
నీళ్లు తాగినా దాహం తీరడం లేదా?.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు!
6 నెలల్లో 20 కిలోలు తగ్గిన మహిళ.. ఆమె డైలీ రొటీన్ ఇదే!
6 నెలల్లో 20 కిలోలు తగ్గిన మహిళ.. ఆమె డైలీ రొటీన్ ఇదే!
0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బుమ్రా
0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బుమ్రా
వందల ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర రోటి పచ్చడి
వందల ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర రోటి పచ్చడి