మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచారు. ఈసారి చర్చకు కారణం అతని లగ్జరీ వాచ్. ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ మెటాలో AI అప్‌డేట్‌లను చర్చించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సమయంలో అతని మణికట్టు మీద కనిపించిన వాచ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వాచ్ చర్చనీయాంశంగా మారింది.
ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటి?
జుకర్‌బర్గ్‌కు అత్యాధునిక గడియారాల పట్ల మక్కువ:
మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను ఇష్టపడతారు. గత నెలలో అతను మరో లగ్జరీ వాచ్ De Bethune DB25 స్టార్రి వేరియస్ ఏరోలైట్ ధరించి కనిపించాడు. ఈ వాచ్ పరిమిత ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం 5 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు. దీని ధర సుమారు రూ. 2.20 కోట్లు. జుకర్‌బర్గ్ ఈ గడియారాలు అతని అత్యాధునిక, ప్రత్యేకమైన అభిరుచులను చూపుతాయి. ఈ వాచ్ కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంది.
ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు, వివాహానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యేందుకు మార్క్ జుకర్‌బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. ఇంతలో అనంత్ అంబానీ ధరించిన వాచ్‌పై వారు ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఇందులో అతను AI గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మణికట్టుకు పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ఖరీదు కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచంలోనే అత్యంత పలుచని గడియారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి