HDFC: కోట్లాది మంది హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్‌.. జూలై 1 నుంచి విలీనం

|

Jun 27, 2023 | 7:29 PM

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలై 1, 2023న, భారతదేశ చరిత్రలో అతిపెద్ద విలీనం జరగబోతోంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ ఆగిపోతుంది. జూలై 1 నుంచి హెచ్‌డిఎఫ్‌సి..

HDFC: కోట్లాది మంది హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్‌.. జూలై 1 నుంచి విలీనం
Hdfc
Follow us on

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలై 1, 2023న, భారతదేశ చరిత్రలో అతిపెద్ద విలీనం జరగబోతోంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ ఆగిపోతుంది. జూలై 1 నుంచి హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెండూ విలీనం కానున్నాయి. ఇవి ఒకటిగా మారనున్నాయి. దీని తరువాత రెండు కంపెనీలు మార్కెట్లో కలిసి వ్యాపారం చేస్తాయి.

జూన్ 30న బోర్డు సమావేశం:

30 రోజుల తర్వాత హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు సమావేశం కానుందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. ఈ సమావేశంలో విలీనాన్ని క్లీయర్‌ చేసి ఆమోదించనుందని అన్నారు. విలీనం తర్వాత జులై 13 నుంచి హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ మార్కెట్‌లో నిలిచిపోనుంది. రెండు కంపెనీల విలీనం తర్వాత కస్టమర్లు అనేక మార్పులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) ఎక్కువ వడ్డీ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఈ బ్యాంక్‌లో ఖాతా ఉన్న వ్యక్తులు దాని కొత్త నిబంధనలను తెలుసుకోవాలి.

అయితే ఈ రెండు సంస్థల ఖాతాదారులకు ఒకే చోట అన్ని సౌకర్యాలు లభిస్తాయి. దీనితో మీరు బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో కలిసి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్‌లో మాత్రమే హెచ్‌డీఎఫ్‌సీ సేవలు కస్టమర్‌లు పొందుతారు. ఈ విలీనం వల్ల కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులు హెచ్‌డిఎఫ్‌సి నుంచి రుణాలు తీసుకుంటున్న రుణగ్రహీతలు ప్రభావితం కానున్నారు. హౌసింగ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌తో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం ఒక సంవత్సరం క్రితం ప్రకటన వెలువడింది. ఈ $40 బిలియన్ల విలీనాన్ని భారతీయ కార్పొరేట్ ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌గా అభివర్ణిస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సికి చెందిన 25 షేర్లకు గాను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 42 కొత్త షేర్లను పంపిణీ చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి