Business Ideas: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు సక్సెస్ అవుతారు? వారి నుంచి నేర్చుకోవాల్సిన బిజినెస్ ట్రిక్స్ ఇవే..
మార్వాడీ కమ్యూనిటీ వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించడానికి గల కారణాలను ఈ వ్యాసం వివరిస్తుంది. రాజస్థాన్‌లోని తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా వలసలు, తరం నుండి తరానికి వ్యాపార మెళకువలు అందడం, ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ వంటివి వారి విజయానికి మూలాలని విశ్లేషిస్తుంది.

మార్వాడి కమ్యూనిటీ వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. వారు సంఖ్యా పరంగా తక్కువే అయినా.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ భారీ సంపదను కలిగి ఉంటారు. చాలా మందికి వారి బిజినెస్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ అర్థం కాదు. రాజస్థాన్లోని మేవార్ ప్రాంతానికి చెందిన మూలాలు కలిగిన ప్రజలను మార్వాడి అని పిలుస్తుంటారు. అయితే వీరిలో ఎక్కువ శాతం వ్యాపార రంగాల్లో విస్తరించడానికి ప్రధాన కారణం రాజస్థాన్లోని తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సహజం అని చెప్పవచ్చు. అలా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు వారి జీవన భృతి కోసం వ్యాపారం చేయడం ప్రారంభించారు. అలా అలా సక్సెస్ అయ్యారు.
సాధారణంగా ఇతర కులాలకు లేదా సమూహాలకు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత సంస్కృతి ఉంటుంది. ఆయా కులాలకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనుల్లో నిమగ్నమై ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో భూములు వ్యవసాయానికి యోగ్యంగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ కులాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందినవే కావడం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం పెద్ద ఎత్తున జరగడమే అని చెప్పవచ్చు.
మార్వాడి కమ్యూనిటీకి చెందినవారు వాణిజ్య రంగంలో రాణించడం వెనక అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీరిలో వ్యాపారం అనేది అనువంశికంగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించడం వల్ల వీరికి వ్యాపార రంగంలో మెలకువలు సులభంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇది కూడా మీరు వ్యాపార రంగంలో విజయం సాధించడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ఆర్థికంగా క్రమశిక్షణగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాల అన్నింటి వల్ల మార్వాడి కమ్యూనిటీ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంత్రప్రెన్యూర్స్ ను అందించడంలో సఫలం అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి నుంచి నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాఠం ఏదైనా ఉందంటే అది ఆర్థిక క్రమశిక్షణ అని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




