Maruti Cars Price: ఇక మారుతి సుజుకి కార్లు మరింత ప్రియం..!
Maruti Cars Price: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కార్ల తయారీకి వాడే ముడి సరుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల ధరలను పెంచేస్తున్నాయి ఆయా..
Maruti Cars Price: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కార్ల తయారీకి వాడే ముడి సరుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల ధరలను పెంచేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇప్పటికే ధరలు పెరుగగా, తాజాగా మారుతి (Maruti) సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. ఆయా మోడల్ కార్లను బట్టి 0.9 నుంచి 1.9 శాతం మధ్య ధరలు తక్షణం పెంచుతున్నట్లు తెలిపింది.
పెరిగిన స్టీల్, రాగి, అల్యూమినియం..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకించి కార్ల తయారీలో కీలకంగా ఉపయోగించే స్టీల్, రాగి, అల్యూమినియం తదితర కీలక లోహాల ధరలు పెరిగాయి. దీని కారణంగా కార్ల తయారీలో ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోయిందని మారుతి సుజుకి తెలిపింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.
అన్ని మోడళ్లపై ధరలు పెంపు:
ఏప్రిల్ 18 నుంచి సగటున అన్ని మోడల్ కార్లపై సగటున 1.3 శాతం ధరలు పెరుగుతాయని మారుతి సుజుకి తెలిపింది. ఇంతకుముందు 2021 జనవరి నుంచి 2022 మార్చి వరకు మారుతి సుజుకి కార్ల ధరలు 8.8 శాతం పెరిగాయి. ఏడాది కాలంగా వివిధ రకాల ఇన్‌పుట్ కాస్ట్‌లు పెరిగిపోవడంతో కార్ల తయారీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని మారుతి సుజుకి తెలిపింది.
ఇవి కూడా చదవండి: