భారతదేశంలోని ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే ఉంటారు. వీరికి సొంత కారులో కుటుంబం అంతా హ్యాపీగా తిరగాలనే కోరిక ఉంటుంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో సొంత కారు కలను నిజం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొన్ని భారతీయ ఆటోమొబైల్‌కంపెనీలు తక్కువ ధరలకే కార్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో మారుతీ సుజుకీ ఇండియాకు ఉన్న డిమాండ్ వేరు. ఈ కంపెనీ కార్లు అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్రాంక్స్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీను లాంచ్ చేసింది. రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే ఈ కార్ బేసిక్ మోడల్ ధర రూ.8,41,500గా ఉంది. అలాగే మిడ్ లెవల్ డెల్టా ట్రిప్ వెర్షన్ ధర రూ.9,27,500గా ఉంది. ఈ కార్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీ లాంచ్ చేసింది. లాంచింగ్ సమయం నుంచి ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కార్ ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా పర్యావరణ అనుకూల డ్రైవింగ్ అనుభవాన్ని పొందాలనుకునేవారికి ఈ కార్ చాలా బాగా నచ్చుతుంది. ఈ కార్ 1.2 లీటర్ల మూడు-సిలిండర్ కే -సిరీస్ డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కార్ సీఎన్‌జీ మోడ్‌లో 6,000 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 77.5 పీఎస్ పవర్ అవుట్‌పుట్ వస్తుంది. అలాగే 4,300 ఆర్‌పీఎం వద్ద 98.5 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ ఇది కిలోకు 28.51 కిలో మీటర్ల మైలేజ ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లలో ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..