Maruti Jimny EMI: మారుతి జిమ్నీ ఒక విలాసవంతమైన 5-సీట్ల ఆఫ్-రోడ్ SUV. ఈ మారుతి సుజుకి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.12.32 లక్షల నుండి ప్రారంభమై రూ.14.45 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఒకేసారి పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. మీరు వాహనాన్ని రుణంపై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ప్రారంభంలో చిన్న డౌన్ పేమెంట్ చేయాలి. అలాగే మిగిలిన మొత్తం ఈఎంఐలుగా మారుతుంది. వీటిని మీరు రుణ వ్యవధి అంతటా నెలవారీగా చెల్లించవచ్చు.
5 సంవత్సరాల రుణానికి ఎంత EMI చెల్లించాలి?
- మారుతి సుజుకి జిమ్నీలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఆల్ఫా (పెట్రోల్). ఈ మోడల్ ధర రూ.13.23 లక్షలు. మీరు ఈ జిమ్నీ మోడల్‌ను కొనుగోలు చేయడానికి ఐదు సంవత్సరాల రుణం తీసుకుంటే 9% వడ్డీ రేటుతో మీరు నెలకు సుమారు రూ.24,700 EMI చెల్లించాలి. లోన్ తీసుకున్న తర్వాత వచ్చే 60 నెలల పాటు ఈ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.
- మీరు ప్రతి నెలా రూ.30,000 వరకు EMIలు చెల్లించగలిగితే మీరు ఈ రుణాన్ని నాలుగు సంవత్సరాలలో కూడా పూర్తి చేయవచ్చు. ఈ మారుతి కారు కోసం నాలుగు సంవత్సరాల రుణానికి నెలవారీ EMI చెల్లింపు 9 శాతం వడ్డీతో రూ.29,700 చెల్లించాలి.
- మీరు జిమ్నీని కొనడానికి తక్కువ EMI మొత్తాన్ని చెల్లించాలనుకుంటే, మీరు 9 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా దాదాపు రూ. 21,500 వాయిదాను డిపాజిట్ చేయాలి.
- మీరు మారుతి జిమ్నీని కొనడానికి ఏడు సంవత్సరాలు రుణం తీసుకుంటే, రుణం తీసుకున్న తర్వాత మీరు 84 నెలల పాటు ప్రతి నెలా దాదాపు రూ. 19,200 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
- మారుతి జిమ్నీ లేదా మరేదైనా కారు కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. కార్ కంపెనీలు, బ్యాంకుల మధ్య వేర్వేరు పాలసీల కారణంగా మొత్తం, గణాంకాలు మారవచ్చని గుర్తించకోండి. ఎందుకంటే వడ్డీ రేట్లలో మార్పులు, కారు ధరలో మార్పు తదితర కారణంగా మీరు చెల్లించే నెలవారి మొత్తం పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు.
ఇది కూడా చదవండి: Putin- Musk: రష్యా అధ్యక్షుడు పుతిన్ – ఎలోన్ మస్క్.. ఇందులో ఎవరికి ఎక్కువ సంపద ఉంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి