Chitra Ramakrishna: చిక్కుల్లో చిత్ర రామకృష్ట.. సెబీ షాకింగ్ నోటీసులు.. అప్పటిలోగా చెల్లించకపోతే..

|

May 25, 2022 | 10:28 AM

Chitra Ramakrishna: స్టాక్ ఎక్స్ఛేంజీలో పాలనా వైఫల్యానికి సంబంధించిన కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణకు కొత్త చిక్కులు మెుదలయ్యాయి. తాజాగా సెబీ నోటీసులు సంచలనంగా మారాయి.

Chitra Ramakrishna: చిక్కుల్లో చిత్ర రామకృష్ట.. సెబీ షాకింగ్ నోటీసులు.. అప్పటిలోగా చెల్లించకపోతే..
Chitra Ramakrishna
Follow us on

Chitra Ramakrishna: స్టాక్ ఎక్స్ఛేంజీలో పాలనా వైఫల్యానికి సంబంధించిన కేసులో రూ. 3.12 కోట్లు చెల్లించాలని ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం నోటీసు పంపింది. 15 రోజుల్లో ఈ మెుత్తాన్ని చెల్లించాలని తెలిపింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమెకు విధించిన జరిమానాను చెల్లించడంలో రామకృష్ణ విఫలమైన నేపథ్యంలో తాజాగా నోటీసులు పంపింది. ఫిబ్రవరి 11 నాటి ఉత్తర్వుల్లో.. ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్‌గా ఉన్నప్పుడు ఆనంద్ సుబ్రమణియన్‌ను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ అడ్వైజర్‌గా నియమించిన కేసులో రామకృష్ణ పాలనా లోపాలున్నాయని ఆరోపిస్తూ సెబి రూ. 3 కోట్ల పెనాల్టీని విధించింది. డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే కంపెనీ రహస్య సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తితో పంచుకున్నందుకు.. రామకృష్ణకు జరిమానా విధించడమే కాకుండా, రామకృష్ణకు ముందున్న రవి నారాయణ్, సుబ్రమణియన్ తో పాటు ఇతరులపై సెబీ పెనాల్టీ విధించింది.

గతంలో ఉత్తర్వుల ప్రకారం పెనాల్టీ చెల్లించనందున.. వడ్డీ, రికవరీ ఖర్చుతో సహా రూ.3.12 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించాలని సెబీ తన తాజా నోటీసులో చిత్ర రామకృష్ణను ఆదేశించింది. బకాయి మెుత్తాన్ని చెల్లించని పక్షంలో.. మార్కెట్ నియంత్రణ సంస్థ ఆమె స్థిరచరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా సొమ్మును రికవరీ చేయనుంది. అంతేకాకుండా రామకృష్ణ ఇప్పటికే తన బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ తో పాటు అరెస్టును ఎదుర్కుంటోంది.

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్ కేసుతో పాటు బోర్డులో ఇతర పాలనా లోపాలతో ముడిపడి ఉన్న దర్యాప్తులో మార్చి 6న సీబీఐచే అరెస్టు చేయబడిన తరువాత రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. గత నెల రెగ్యులేటర్ నారాయణ్, సుబ్రమణియన్‌లకు ఇదే విధమైన డిమాండ్ నోటీసులను జారీ చేసింది. ఏప్రిల్‌లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) బోర్ట్స్ లో గవర్నెన్స్ లోపాలకు సంబంధించి సెబీ ఆర్డర్‌కు వ్యతిరేకంగా రామకృష్ణ చేసిన అభ్యర్థనను అంగీకరించింది. అదేసమయంలో రూ. 2 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రామకృష్ణ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వాయిదా వేసిన బోనస్‌ల కోసం రూ. 4 కోట్ల కంటే ఎక్కువ మెుత్తాన్ని.. సెబీ సూచించిన ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్‌లో కాకుండా.. ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ చేయాలని అప్పీలేట్ ట్రిబ్యునల్ NSEని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి