Silver Price Today
Today Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే.. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారంతోపాటు వెండి ధర కిలోకు రూ.780 మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,420 ఉండగా, ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.65,420 ఉంది. చెన్నైలో రూ.69,900 ఉండగా, బెంగళూరులో రూ.67,600 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,420 వద్ద కొనసాగుంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఇక హైదరాబాద్‌లో వెండి కిలో రూ.69,900 ఉంది. విజయవాడలో రూ.69,900 ఉంది.
బంగారం..
ఇదిలాఉంటే.. దేశంలో 10 గ్రాముల బంగారంపై రూ.470 తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,220 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశీయంగా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్రాష్ట్రీయ సమస్యలు వంటి పలు అంశాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో.. బంగారం, వెండి ధరలు కొన్ని రోజులు పెరుగుతుంటే.. మరికొన్ని రోజులు తగ్గుతుండటం విశేషం.
Also Read: