Today Gold Price: దేశంలో బాంగారం, వెండి కొనుగళ్లలో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రతి రోజు ఎగబాకుతున్న పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశీయంగా బంగారం ధర ఇలా ఉన్నాయి. దేశీయంగా 10 గ్రామంపై రూ.470 తగ్గుముఖం పట్టింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,020 వద్ద ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉంది.
అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 వద్ద కొనసాగుతోంది.
అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గదా… ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేం అంటున్నారు. అయితే.. వచ్చే 2 నెలల తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతాయనే అంచనాతో ఉన్నారు. మళ్లీ 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.50,000 చేరే అవకాశం కూడా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఆగస్టు 7న నగల బంగారం ధర 10 గ్రాములు అత్యధికంగా రూ.54,200 ఉంది. మరి ఇప్పుడో రూ.42 వేలకుపైగా ఉంది. అంటే… ఈ 7 నెలల్లో బంగారం ధర రూ.12,100 తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారమైతే 7 నెలల్లో రూ.13,200 తగ్గింది.
కాగా, దేశీయంగా పసిడ ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.
SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు, యంత్రాలు.. నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం
భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!