Deadline: ఈ మూడు పనులకి మార్చి 31 గడువుతేదీ.. త్వరపడకపోతే పెనాల్టీలు భరించలేరు..!

|

Mar 01, 2022 | 7:25 PM

Deadline: మనం కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు గడువులోగా చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రోజులు పెరుగుతున్న కొద్ది నిబంధనలలో మార్పులు వస్తూనే ఉంటాయి.

Deadline: ఈ మూడు పనులకి మార్చి 31 గడువుతేదీ.. త్వరపడకపోతే పెనాల్టీలు భరించలేరు..!
Follow us on

Deadline: మనం కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు గడువులోగా చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రోజులు పెరుగుతున్న కొద్ది నిబంధనలలో మార్పులు వస్తూనే ఉంటాయి. వాటికనుగుణంగా మనం పనులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీలు చెల్లించడమే కాకుండా సమయం మొత్తం వృథా అవుతుంటుంది. ఇక మార్చిలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి గడువు మార్చి 31గా నిర్ణయించారు. అందులో మొదటిది పాన్‌కార్డ్‌, ఆధార్‌తో లింక్ చేయడం. ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. ఈ పని పూర్తి చేసేందుకు ఇప్పటికే ఎన్నో సార్లు గడువు ఇచ్చింది. మీరు ఒక వేళ ఆధార్‌-పాన్‌ కార్డు అనుసంధానం చేయకపోతే మార్చి 31లోగా చేయాల్సి ఉంటుంది. ఒక వేళ గ‌డువు త‌ర్వాత లింక్‌ చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనుసంధానం చేయకపోతే పాన్ ఇన్‌ ఆపరేటివ్‌గా మారుతుంది. దీంతో మీరు షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నిధులు మ‌దుపు చేయ‌డం చాలా కష్టమవుతుంది.

బ్యాంకు కేవైసీ దాఖలుకు తుది గడువు

వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ బ్యాంకులకు కేవైసీ పత్రాలు సమర్పించేందుక తుది గడువు మార్చి 31. గతంలో ఇది డిసెంబర్‌ 31 వరకు ఉండేది. కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31, 2022కి పొడిగించింది. ఖాతాదారులు గడువులోగా ఈ పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి చివరి నాటికి కేవైసీ పత్రాలు లేకున్నా బ్యాంకులు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోపు కేవైసీ పూర్తి చేసుకుంటే మంచిది.

ఐటీఆర్ ఫైలింగ్ గ‌డువు తేది

మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ స‌మ‌ర్పించకపోతే మార్చి 31 తుది గడువు. ఈ నెల ఒక‌టో తేదీ నుంచి మార్చి 31 లోపు స‌మ‌ర్పించే ఐటీఆర్‌ల‌ను లేట్‌ ఐటీఆర్ అని పేర్కొంటారు. రూ.5 ల‌క్షల్లోపు ఆదాయానికి రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పాత టాక్స్‌ విధానాన్ని ఎంచుకున్నట్లయితే ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే అవసరమైన పనులను మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలి.

Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..

Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!

Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!