Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు దూసుకుపోగా తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 66,900 ఉండగా, చెన్నైలో రూ.71,400 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, బెంగళూరులో రూ. 66,900 ఉంది. ఇక కోల్ కతాలో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, కేరళలో రూ.66,900 ఉంది. ఇక పూణేలో కిలో వెండి ధర రూ.66,900 ఉంది. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, ఏపిలోని విజయవాడలో రూ.71,400 ఉంది. ఇక విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.71,400 ఉంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో బంగారం, వెండి ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఒక సమమంలో బంగారం 55 వేల మార్క్ దాటిపోగా, వెండి కూడా 75వేలు దాటిపోయింది. ఆ సమయంలో బంగారం, వెండి ధరలను చూసి సామాన్యులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత బంగారం, వెండి ధరలు క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
అయితే దేశీయంగా బంగారం, వెండి ధరగడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి : Gold Price Today: వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధరలు.. సోమవారం 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..