MapMyIndia IPO: కొనసాగుతోన్న మ్యాప్‎మైఇండియా ఐపీఓ.. మొదటి రోజు గంటలోనే పూర్తి సబ్‎స్క్రిప్షన్..

MapMyIndia ప్రారంభ పబ్లిక్ ఆఫర్ గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం అయింది. డిసెంబరు 13 వరకు సబ్‌స్క్రప్షన్‎కు అవకాశం ఉంది...

MapMyIndia IPO: కొనసాగుతోన్న మ్యాప్‎మైఇండియా ఐపీఓ.. మొదటి రోజు గంటలోనే పూర్తి సబ్‎స్క్రిప్షన్..

Updated on: Dec 10, 2021 | 7:06 AM

MapMyIndia ప్రారంభ పబ్లిక్ ఆఫర్ గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం అయింది. డిసెంబరు 13 వరకు సబ్‌స్క్రప్షన్‎కు అవకాశం ఉంది. CE ఇన్ఫో సిస్టమ్స్ యాజమాన్యంలోని MapmyIndia, అధునాతన డిజిటల్ మ్యాప్‌లు, జియోస్పేషియల్ సాఫ్ట్‌వేర్, లొకేషన్‌లో ప్రముఖ ప్రొవైడర్‎గా ఉంది. రూ. 1,039.6 కోట్ల IPO రిటైల్ భాగం ఈరోజు ప్రారంభమైన మొదటి గంటలోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. మధ్యాహ్నం 2:20 గంటలకు, IPO 1.22 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

అయితే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ కోసం రిజర్వ్ చేసిన పోర్షన్‌కు 0.15 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) భాగం 0.15 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అయింది. MapMyIndia IPO ఒక్కో షేరుకు రూ. 1,000-1,039గా ధరను నిర్ణయించారు. IPO ప్రారంభానికి ముందు, కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 312 కోట్ల రూపాయలను సేకరించింది. IPO పూర్తిగా ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్ ద్వారా 10,063,945 ఈక్విటీ షేర్ల వరకు అమ్మకానికి ఆఫర్ (OFS)గా వచ్చింది.

పెట్టుబడిదారులు కనిష్ఠగా ఒక లాట్ కొనుగోలు చేయవచ్చు. ఒక లాట్‎లో 14 ఈక్విటీ షేర్లు ఉంటాయి. గరిష్ఠంగా 13 లాట్లు కొనుగోలు చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు IPOలో రూ. 2,00,000 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్ పెట్టుబడిదారులు కనిష్ఠంగా 14 షేర్లు లేదా ఒక లాట్‌ను రూ. 14,462కు కొనుగోలు చేయవచ్చు.గరిష్ఠంగా 13 లాట్‌లు లేదా రూ. 1,88,006 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 16న కేటాయింపు ఉంటుంది. డిసెంబర్ 21న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానుంది. కంపెనీ యొక్క బలమైన ఆర్థిక స్థితి, లాభదాయకమైన వ్యాపార నమూనా, అధిక నగదు ప్రవాహాల దృష్ట్యా చాలా బ్రోకరేజీలు IPOకి బుస్టింగ్ ఇచ్చాయి.

Read Also.. Stock market: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 రోజుల్లో లక్షా 50 వేలు వచ్చాయి..