Success Story: లక్షల జీతం వచ్చే జాబ్‌ను వదులుకుని.. సొంత కంపెనీతో దేశ స్థాయిలో గుర్తింపు.. ఈమె సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే..

కార్పొరేట్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించి వేలమందికి ఉపాధి కల్పించాలనేది ఆమె ఆశ. చివరికి ఆమె అనుకున్నది సాధించింది. తత్విక్ ఆయుర్వేద అండ్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్ రింజిమ్ సైకియా సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

Success Story: లక్షల జీతం వచ్చే జాబ్‌ను వదులుకుని.. సొంత కంపెనీతో దేశ స్థాయిలో గుర్తింపు.. ఈమె సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే..
Rimjhim Saikia

Edited By:

Updated on: Jan 17, 2026 | 3:38 PM

కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సొంత వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయిన ఎంతోమంది విజయగాథలు మనం వింటూ ఉంటారు. అదే బాటలో నడిచి విజయం సాధించారు రింజిమ్ సైకియా. తత్విక్ ఆయుర్వేద, వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించి అనతికాలంలో పాపులర్ అయ్యారు. ఆమె ధైర్యం, కృషి, స్వయంశక్తి ఎంతో మంది యువతకు స్పూర్తిదాయకంగా మారింది. ఆమె ఇన్ఫిరేషనల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

కొర్పొరేట్ జాబ్ వదిలి కంపెనీ స్థాపన

రింజిమ్ సైకియా ఐఐటీ ఢిల్లీలో డిజిటల్ మార్కెటింగ్‌లో డిప్లోమా పూర్తి చేశారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌బీసీ, వొడాఫోన్ వంటి సంస్థల్లో పనిచేశారు. మంచి జీతం ఉన్నప్పటికీ.. వ్యాపారం పెట్టాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో తాత్విక్ ఆయుర్వేద అండ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిడెట్ సంస్థను స్థాపించారు. కంపెనీ మొదలుపెట్టిన మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. ఓపిక, ఓర్పుతో కొనసాగించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆయర్వేద, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ఈ బ్రాండ్ ప్రసిద్ది పొందింది. కేవలం ఆయుర్వేదాన్ని వ్యాపారంగానే కాకుండా మహిళా సాధికారికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిపుతున్నారు. ఆమె కంపెనీలో 80 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. తన సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి ఆర్ధికాభివృద్దికి తోడ్పాటు అందిస్తున్నారు. మహిళలు అభివృద్ది చెందినప్పుడే సమాజం బలంగా ఉంటుందని రింజిమ్ చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు

రింజిమ్ సైకియా కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023లో కేంద్ర MSME మంత్రి దేశంలో టాప్ 12 వర్ధమాన మహిళా వ్యవస్థాపకులలో ఒకరిగా ఆమెను గుర్తించారు. ఈ గౌరవం ఆమె కృషికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆర్ధిక స్వేచ్చ కేవలం డబ్బులు సంపాదించడం ద్వారా రాదని, సొంత నిర్ణయాలను అమలు చేసి సక్సెస్ సాధించడం ద్వారా వస్తుందని రింజిమ్ సక్సెస్ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దృఢమైన సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ఆమె నేటి యువత తరానికి చేసి చూపించింది. తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతకు రింజిమ్ ప్రమాణం ఒక ప్రేరణ అని చెప్పుకోవచ్చు.

పెట్టుబడిదారులకు అవగాహన

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒకేసారి KYC ప్రక్రియ అవసరం. ఇది రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలతో మాత్రమే చేయాలి. వీటి వివరాలు SEBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పెట్టుబడిదారులు ఏవైనా ఫిర్యాదుల కోసం నేరుగా AMCని సంప్రదించవచ్చు లేదా SCORES పోర్టల్ (https://scores.gov.in)లో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కారం సంతృప్తికరంగా లేకుంటే, స్మార్ట్ ODR పోర్టల్ (https://smartodr.in/login)ని ఉపయోగించవచ్చు.

HDFC AMC గురించి

HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో ఒకటి. ఇది 1999లో స్థాపించబడగా.. SEBI ఆమోదం పొందిన తర్వాత 2000లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ఈక్విటీ, స్థిర ఆదాయం, ఇతర పెట్టుబడి ఎంపికలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక శాఖల బ్యాంకులు, స్వతంత్ర ఆర్థిక సలహాదారులు, జాతీయ పంపిణీదారుల ద్వారా సేవలను అందిస్తుంది.