Market News: అంతర్జాతీయ మార్కెట్ల(International markets) ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం పతనమయ్యాయి. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణం(Inflation) కట్టడిలో భాగంగా US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యవిధానం కట్టుదిట్టం చేయడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్ 500 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో సూచీ నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పతనంలో ట్రేడ్ అవుతోంది. మరో కీలక సూచీ బ్యాంక్ నిఫ్టీ సైతం 500 పాయింట్ల నష్టపోయింది. కేవలం నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 130 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలోని కోల్ ఇండియా 2.85%, ఎన్టీపీసీ 2.11%, యూపీఎల్ 1.77%, యస్ బ్యాంక్ 1.54%, హెచ్పీసీఎల్ 1.29%, అదానీ పోర్ట్స్ 1.10%, టాటా స్టీల్ 1.07%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.06%, హిందుస్థాన్ యూనీలివర్ 1.03%, భారతీ ఎయిర్ టెల్ 0.85% మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.65%, హెచ్డీఎఫ్సీ 2.56%, హెచ్సీఎల్ టెక్నాలజీ 1.95%, టెక్ మహీంద్రా 1.89%, టీసీఎస్ 1.83%, ఇన్ఫోసిస్ 1.61%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.46%, యాక్సిస్ బ్యాంక్ 1.42%, బజాజ్ ఆటో 1.28%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.95% మేర పతనమై టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Investments: నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తే.. గడువు ముగిసేసరికి లక్షల ఆదాయం పొందొచ్చు..
Elon Musk: ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా ఎలాన్ మస్క్..! అసలు మ్యాటర్ ఏమిటంటే..