Mahindra BE.05: త్వరలో సందడి చేయనున్న మహీంద్రా కారు.. వచ్చే ఏడాది విడుదల కానున్న బీఈ 05

|

Oct 09, 2024 | 6:45 PM

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. వివిధ రకాల ప్రత్యేక ఫీచర్లతో కార్లు సందడి చేస్తున్నాయి. మోడరన్ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. అత్యాధునిక ప్రత్యేకతలతో వాహనాలను తయారు చేసి మార్కెట్ లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి.

Mahindra BE.05: త్వరలో సందడి చేయనున్న మహీంద్రా కారు.. వచ్చే ఏడాది విడుదల కానున్న బీఈ 05
Mahindra Be.05
Follow us on

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. వివిధ రకాల ప్రత్యేక ఫీచర్లతో కార్లు సందడి చేస్తున్నాయి. మోడరన్ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. అత్యాధునిక ప్రత్యేకతలతో వాహనాలను తయారు చేసి మార్కెట్ లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీతో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఈవీల తయారీపై అనేక ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ సంస్థ 2022లోనే తన ఈవీల లైనప్ ను వెల్లడించింది.

ఎస్ యూవీల ఉత్పత్తి

మహీంద్రా సంస్థ ఈ ఏడాదికి చివరి నాటికి తన ఎలక్ట్రిక్ ఎస్ యూవీల ఉత్పత్తిని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మొదట్లో వాటిని లాంచ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. విశ్వసనీయ సమాచారం మేరకు 2025 జనవరి నాటికి బీఈ.05ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ కారు ఇప్పటికే ఒక వాణిజ్య ప్రకటన సమయంలో కనిపించింది. దీనికి అన్ని రకాల టెస్టులను కంపెనీ పూర్తి చేసినట్టు తెలిసింది.

మహీంద్రా బీఈ.05

మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్ యూవీకి సంబంధించి వివిధ వార్తలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం ఈ కొత్త కారు 4,370 ఎంఎం పొడవు, 1900 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తు కలిగి 2,775 వీల్ బేస్ తో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో సందడి చేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా మారుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆకట్టుకునే ఫీచర్లు

బీఈ.05 కారులో సీ ఆకారపు లైట్లు, రేఖలు, బోల్డ్ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటుంది. పెద్ద చక్రాలు కలిగిన ఎత్తయిన కారు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రహదారిపై వెళుతుంటే ప్రతి ఒక్కరూ తల తిప్పుకుని చూసేలా ఉంటుంది. గ్రిల్, హెడ్ లైట్లు, అద్దాలు, సైడ్ ప్యానెళ్లు ఎంతో ఆకట్టుకుంటాయి. కారు క్యాబిన్ లోని ప్లాట్ డ్యాష్ బోర్డుపై అమర్చిన ట్వీన్ – స్క్రీన్ సెటప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మోటారు ప్రత్యేకతలు

వోక్స్ వ్యాగన్ నుంచి తీసుకువచ్చిన మోాటారుతో ఇన్ హౌస్ అభివృద్ధి చేసిన ఐఎన్జీఎల్వో స్కేట్ బోర్డు ప్లాట్ ఫాంతో ఈ కారును రూపొందించారు. వాలియో మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. రెండు రకాల బ్యాటరీ ఎంపికతో బీఈ.05 అందుబాటులోకి వస్తుంది. 79 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్ ప్యాకేజీలతో లభిస్తుంది. బ్యాటరీలను వేగంగా చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. 175 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్ తో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని 20 నిమిషాల్లో దాదాపు 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..