Mahindra XUV 400: బంపర్‌ ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!

Mahindra XUV 400 Discount: కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఈ నెలలో తన అనేక ప్రసిద్ధ SUV లపై వివిధ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు రాబోయే రోజుల్లో మహీంద్రా SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు గొప్ప సమయం కానుంది..

Mahindra XUV 400: బంపర్‌ ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
Mahindra Xuv 400 Discount

Updated on: Dec 26, 2025 | 8:44 PM

Mahindra XUV 400 Discount: కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఈ నెలలో తన అనేక ప్రసిద్ధ SUV లపై వివిధ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు రాబోయే రోజుల్లో మహీంద్రా SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు గొప్ప సమయం కానుంది. ఈ నెల మాత్రమే చెల్లుబాటు అయ్యే మహీంద్రా SUV లపై డిసెంబర్ 31 వరకు లక్షల రూపాయల డిస్కౌంట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం చివరి రోజుల్లో అమ్మకాలను పెంచడానికి, MY 2025 స్టాక్‌ను క్లియర్ చేయడానికి మహీంద్రా ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.

మహీంద్రా ప్రసిద్ధ SUV, మహీంద్రా XUV400పై భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. కంపెనీ ప్రస్తుతం దీనిపై అత్యధిక తగ్గింపును అందిస్తోంది. ఈ SUV పై ప్రస్తుతం రూ.4.45 లక్షల వరకు ఆఫర్లు అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: January 2026 Changes: క్రెడిట్ స్కోర్ నుండి ఆధార్-పాన్ లింకింగ్ వరకు.. జనవరిలో అమల్లోకి రానున్న కీలక మార్పులు!

ఇవి కూడా చదవండి

మహీంద్రా XUV 400 ధర

ముందుగా మహీంద్రా XUV 400 ధర రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, SUV ఆన్-రోడ్ ధర రూ.16.71 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిసెంబర్‌లో దీన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు లక్షల రూపాయల తగ్గింపు పొందవచ్చు.

మహీంద్రా XUV 400 పై డిస్కౌంట్:

మహీంద్రా XUV 400 పై రూ.4.45 లక్షల (ఎక్స్-షోరూమ్) డిస్కౌంట్ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు కారు మోడల్, వేరియంట్ ప్రాంతం, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు.

ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్‌.. ఈనెల 31 వరకే ఛాన్స్‌!

మహీంద్రా కార్ల డిస్కౌంట్లు:

మహీంద్రా XUV 400 తో పాటు, మహీంద్రా అనేక ఇతర SUV లపై డిస్కౌంట్లను అందిస్తోంది, అవి:

  • మహీంద్రా XUV 3XO – రూ.1.14 లక్షలు
  • మహీంద్రా స్కార్పియో క్లాసిక్ – రూ.1.40 లక్షలు
  • మహీంద్రా స్కార్పియో N – రూ.85,600
  • మహీంద్రా థార్ రాక్ – రూ.1.20 లక్షలు
  • మహీంద్రా XUV 700 – రూ.1.55 లక్షలు

ఇది కూడా చదవండి: January Bank Holiday: వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి