Mahindra Offers: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కస్టమర్లకు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. తన కంపెనీకి చెందిన పలు మోడళ్ల కార్లపై భారీ స్థాయిలో రాయితీలు ప్రకటించింది. బొలెరో ఎస్‌యూవీ నుంచి ఆల్టూరస్ జీ4 వరకు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ల విలువ మోడళ్లను బట్టి గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు ఉంది. ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో.. బొలెరో మొడల్ ఎస్‌యూవీపై రూ. 24,050 రాయితీని ప్రకటించింది మహీంద్రా కంపెనీ.
మోడళ్ల వారీగా చూసుకున్నట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి..
1. మరాజోపై రూ. 36 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
2. మహీంద్రా ఎక్స్‌యూవీ 300- రూ.45 వేల వరకు..
3. స్కార్పియో(ఎస్5) రూ.60 వేల వరకు..
4. కేయూవీ ఎన్ఎక్స్‌టీపై రూ.38 వేల వరకు..
5. మహీంద్రా సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీపై గరిష్ఠంగా రూ.44,500 వరకు..
6. మహీంద్రా ఎక్స్‌యూవీ 500పై రూ.50,780 వరకు..
7. ఆల్టూరస్‌పై రూ.3.06 లక్షల వరకు..
ఈ ఆఫర్లన్నీ.. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు బెనిఫిట్లు పేర్లతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన కస్టమర్లకు అందిస్తోంది. అయితే, ఈ ఆపర్లు దేశ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సైట్‌ని సందర్శించవచ్చు.
Also read:
ఉత్తరాఖండ్ విలయం: తపోవన్ టన్నెల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి, సహాయక చర్యలు నిలిపివేత
Cricket Betting: అనుమతి లేకుండానే స్టేడియంలోకి వెళ్లారు.. ఆపై వారు చేసిన పనికి అరెస్టయ్యారు..