ఈ సంవత్సరం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC) 2023 పథకాన్ని ఇప్పుడు వివిధ బ్యాంకుల నుండి పొందవచ్చు. ఫిబ్రవరి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఈ పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది పోస్టాఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మీరు 16 బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పొందవచ్చు. 4 ప్రైవేట్ బ్యాంకులు, 12 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ఉన్నాయి. ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ పత్ర యోజన అన్ని ప్రభుత్వ బ్యాంకులు, 4 ప్రైవేట్ బ్యాంకులలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే చాలా మంది మహిళలు ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ 2023 బడ్జెట్ సమావేశాల్లో వన్‌టైమ్ సేవింగ్స్ స్కీమ్ అయిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో వారి కోసం లేదా మైనర్‌ల కోసం అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ను అందించడానికి అధికారం కలిగి ఉన్నాయని అని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి