Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. మరో వారం రోజుల టైమ్.. నో టెన్షన్..

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆగస్ట్ 31తో ముగిసిన ఈకేవైసీ గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల నుంచి ప్రకటన జారీ అయింది. ఈ మేరకు కస్టమర్లకు సూచిస్తున్నాయి.

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. మరో వారం రోజుల టైమ్.. నో టెన్షన్..
Gas Ekyc

Updated on: Sep 01, 2026 | 7:07 PM

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. గ్యాస్ ఈకేవైసీ గడువును సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. మరో వారం రోజుల పాటు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీలోకా అందరూ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 31తో డెడ్ లైన్ ముగియంతో గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీల నుంచి గడువు పొడిగింపుపై ప్రకటన వచ్చింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఊరట చెందుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేయనివారు.. ఆలోగా కేవైసీ పూర్తి చేయాలని కంపెనీలు కస్టమర్లకు ఎస్ఎంఎస్ రూపంలో మెస్సేజ్‌లు పంపుతున్నాయి.

ఇప్పటివరకు కేవలం 86 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేశారని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నారు. అయితే పూర్తి చేయనివారిలో కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. గ్యా్స్ ఈకేవైసీ ప్రక్రియ అనేది కొన్ని నెలలుగా కొనసాగుతోంది. గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. అయితే సబ్సిడీ ధరలకు సిలిండర్ పొందలేరు. అసలు ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ఈకేవైసీ పూర్తి చేశాక తిరిగి దేశీయ ధరలకే గ్యాస్ రీఫిల్లింగ్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత దేశీయ రేటుకు సిలిండర్ సరఫరా తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు.

అయితే ఈకేవైసీని పూర్తి చేయనివారికి ఏ ధరకు సిలిండర్ రీఫిల్‌లను అందించాలనే దానిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో దేశీయ రేటుకే రీఫిల్‌లను పొందేందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు కస్టమర్లకు కోరుతున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో మీరు అసలు ధరకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా కేంద్రం ఏడాదికి నాలుగు సిలిండర్లపై రూ.300 సబ్సిడీ అందిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలను అందిస్తున్నాయి. పేదలకు గ్యాస్ బండ భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే కేంద్రం కేవైసీని తప్పనిసరి చేసింది. నిజమైన లబ్దిదారులను గుర్తించేందుకు, గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డకట్ట వేసేందుకు దీనిని అమలు చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us