August 30, 2026
Subhash
పాత పరుపుపై సంవత్సరాల తరబడి నిద్రిస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే. కొందరు ఏళ్ల తరబడి పరుపును వాడుతుంటారు.
నిద్రలేచిన వెంటనే తరచూ నడుము, శరీరంలో నొప్పులు ఉంటే.. అందుకు పాత పరుపు కూడా ఒక కారణం కావచ్చు. వెంటనే మార్చడం ముఖ్యమని గుర్తించుకోవాలి.
కాలం గడిచేకొద్దీ పరుపు తన ఆకారం, సపోర్ట్‌ను కోల్పోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే పాత పరుపును మార్చడం ఉత్తమమని గుర్తించుకోండి.
ఎక్కువ కాలం ఉపయోగించిన పరుపులో ధూళి, చర్మపు మృతకణాలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల మీ ఆరోగ్యానికి మంచిది కాదని గర్తింకోండి.
పాత పరుపులో పేరుకుపోయే ధూళి, అలర్జెన్లు కొంతమందిలో అలర్జీ సమస్యలకు కారణం కావచ్చు. ఏళ్ల తరబడి ఉన్న పరుపును మార్చడం ఉత్తమం.
సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల తర్వాత పరుపును మార్చడం గురించి ఆలోచించాలి. అయితే పరుపు పరిస్థితిని బట్టి అంతకంటే ముందే మార్చాల్సి రావచ్చు.
పరుపు కుంగిపోవడం, సపోర్ట్ తగ్గడం లేదా నిద్రకు ఇబ్బంది కలిగితే.. 7-10 సంవత్సరాలు పూర్తయ్యే వరకు తప్పనిసరిగా వేచి ఉండాల్సిన అవసరం లేదు.
పరుపు వయసుతో పాటు దాని పరిస్థితిని కూడా గమనించండి. మంచి సపోర్ట్ ఇచ్చే, సౌకర్యవంతమైన పరుపును ఎంచుకోవడం మంచి నిద్రకు కీలకం.