LPG Price Hike: సామాన్యులకు షాక్‌.. మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపు.. ఏ నగరంలో ఎంత ధర అంటే..!

|

May 19, 2022 | 9:06 AM

LPG Gas Cylinder Price Hike: సామాన్యులకు మరోసారి షాకిచ్చాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలను పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ..

LPG Price Hike: సామాన్యులకు షాక్‌.. మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపు.. ఏ నగరంలో ఎంత ధర అంటే..!
Follow us on

LPG Gas Cylinder Price Hike: సామాన్యులకు మరోసారి షాకిచ్చాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలను పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, నిత్యవసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిన మరో భారం పడింది. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచాయి. 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరపై రూ.3.50పైసల మేర పెంచయగా, అదే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధరపై రూ.8 పెంచాయి. ఈరోజు నుంచి ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. రూ. 1003కు చేరుకుంది. ఇక ముంబైలో రూ. 1002.50 ఉండగా, కోల్‌కతాలో రూ. 1029కు చేరింది. ఇక చెన్నైలో రూ. 1018.5కు ఎగసింది. అయితే LPG గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం ఈనెలలో ఇది రెండోసారి. మే 7వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.50 పెంచిన ఆయిల్‌ కంపెనీలు.. ఇప్పుడు డొమెస్టిక్‌తో పాటు కర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచేశాయి. తాజాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరగడంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ. 2354 ఉండగా, కోల్‌కతాలో రూ.2454 ఉంది. ఇక ముంబైలో రూ. 2507 ఉంది.

అంతకుముందు అంటే మే 7న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. ఆ తర్వాత ఢిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరుకోగా, అంతకుముందు ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.949.50గా ఉండేది. ఇక మే 19, 2022న పెరగడంతో ఈ ఏడాది మూడోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినట్లయ్యింది. మార్చి 22న దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మార్చి 21 వరకు ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.899.50 ఉండగా, మార్చి 22న రూ.949.50కి చేరింది. ఇక మే 7 న సిలిండర్ ధర పెరిగినప్పుడు ఢిల్లీలో దాని ధర 999.50 వరకు ఉండగా, ఆ తర్వాత ఈరోజు మళ్లీ LPG ధరలను పెంచడంతో దాని ధర రూ.1003కి చేరుకుంది. ఢిల్లీతో పాటు కోల్‌కతాలో ఎల్‌పీజీ తాజా ధర రూ.1029.50, ముంబైలో రూ.1003, చెన్నైలో రూ.1018.50కి పెరిగింది. మీరు మీ నగరంలో LPG సిలిండర్ యొక్క తాజా ధరను తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని చూడవచ్చు .

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి