ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ప్రైస్‌ను ఊహించని స్థాయిలో పెంచేసిన కేంద్రం.. వినియోగదారులకు మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సామాన్యుడు కొనలేని స్థితికి గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది. పేదలు, నిరుపేదలైతే అసలు గ్యాస్ సిలిండర్ వైపు కూడా చూడలేని రేంజ్‌కి దాని ధర చేరింది. కొద్దోగొప్పో గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న సామాన్య ప్రజానీకానికి ఇప్పుడు ఇంకో షాక్ ఇవ్వబోతోందన్న వార్త గుండెల్లో దడ పుట్టిస్తోంది.
అనేక నిత్యవసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన కేంద్రం, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై న్యూ రూల్స్ తీసుకురాబోతోందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం జరుగుతోన్న రూల్స్ ప్రకారం ఇకపై ఏడాదికి పదిహేను గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అలాగే, నెలకు రెండు సిలిండర్లు కొనుగోలు చేసేలా రూల్స్‌ను మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాన్ సబ్సిడీ కనెక్షన్ కస్టమర్స్ ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న రిపోర్ట్స్ ఆధారంగా ఈ కొత్త రూల్స్‌ని తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, ఎవరికైనా అదనంగా సిలిండర్లు అవసరమైతే రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేస్తే ఇచ్చేలా రూల్స్ ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.