Gas Cylinder: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు.. ఎంతో తెలుసా.?

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ వినిపించాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు..

Gas Cylinder: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు.. ఎంతో తెలుసా.?
Gas Cylinder

Updated on: May 01, 2023 | 8:16 AM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ వినిపించాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. ఇవాళ(మే 1) రేట్లు తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు సోమవారం(మే 1) నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1856.50కి తగ్గింది. అటు ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,808.50 కాగా, కోల్‌కతాలో రూ. 1,960.50, చెన్నైలో రూ.2,021.50గా ఉంది.

గత రెండు నెలలు కమర్షియల్ సిలిండర్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. మార్చి‌లో రూ.350 మేరకు పెంచగా.. ఏప్రిల్‌లో రూ. 91.50 చొప్పున తగ్గించాయి. ఇక ఇప్పుడు మేలో మరోసారి రూ. 171.50 మేర కమర్షియల్ సిలిండర్లపై ధరను తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇక గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రకటించాయి. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. కాగా, గ్యాస్ సిలిండర్ ధరల విషయానికొస్తే.. స్థానిక పన్నుల బట్టి.. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి.