LPG Cylinder Price: ఇకపై రూ.500లకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..
కొంతకాలంగా వంటగ్యాస్ ధర పెరుగుదల కారణంగా ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం వంటగ్యాస్ ధర వెయ్యి రూపాయలకుపైగా ఉంది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.1053, హైదరాబాద్‌లో రూ.1105, ముంబైలో రూ.1052.50, కోల్‌కతాలో రూ.1079గా ఉంది..

కొంతకాలంగా వంటగ్యాస్ ధర పెరుగుదల కారణంగా ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం వంటగ్యాస్ ధర వెయ్యి రూపాయలకుపైగా ఉంది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.1053, హైదరాబాద్‌లో రూ.1105, ముంబైలో రూ.1052.50, కోల్‌కతాలో రూ.1079గా ఉంది. ఇక మీరు కేవలం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ పథకం కింద ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోజనం దీని కింద అర్హులైన వ్యక్తులకు మాత్రమే అవకాశం దక్కుతుంది. ఈ పథకం కింద మీరు రూ. 500కి సిలిండర్‌ను ఎలా పొందవచ్చో, దాని ప్రయోజనం ఎవరికి అందించబడుతుందో తెలుసుకుందాం. ఇంకో విషయం ఇది తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే ఈ స్కీమ్ రాజస్థాన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
ఉజ్వల యోజన పథకం కింద 76 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్లను అందజేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ఈ ప్రకటన చేసింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. 2022లోనే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఏడాదికి రూ. 500 చొప్పున 12 సిలిండర్లు తీసుకోవచ్చని గెహ్లాట్ ప్రభుత్వం వెల్లడించింది.
ఎవరు ప్రయోజనం పొందుతారు:
మీరు రాజస్థాన్ రాష్ట్ర నివాసి అయితే, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లయితే మీకు ఎల్‌పీజీ సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. మరొక రాష్ట్ర పౌరుడు రాజస్థాన్‌లో నివసిస్తుంటే, అతనికి ఈ పథకం కింద ప్రయోజనం అందదని గుర్తించుకోవాలి. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత మాత్రమే ప్రయోజనాలు అందించనుంది ప్రభుత్వం.




మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు:
మీరు రాజస్థాన్ పౌరుడిగా ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లయితే, రూ. 500కి ఎల్‌పిజి సిలిండర్‌ను పొందడానికి మీరు ఉజ్వల పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి మీరు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలతో మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..