Gas prices Hike: ఇప్పటికే దేశంలో పెట్రోలు, డీజిల్(Petrol, Diesel) ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుని ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు త్వరలో పెరగనున్న వంటగ్యాస్(Cooking gas) ధరలు సామాన్యులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) కారణంగా మరికొన్ని వారాల్లో వంటగ్యాస్ ధరలు సామాన్యుల జేబులకు చిల్లుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరా విషయంలో తీవ్ర ఆటంకాలు ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ నుంచి వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయి. వీటికి తోడు సీఎన్జీ, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. గ్యాస్ ఆధారంగా కరెంట్ ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ ప్రభావం ఉండనుంది. అందువల్ల విద్యుత్ బిల్లులు కూడా పెరిగే ప్రమాదం పొంచిఉంది.
పెట్రో ధరలు పెరగడం వల్ల పరోక్షంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసరాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. యూరోపియన్ దేశాలకు ఎక్కువగా గ్యాస్ సరఫరా చేసే అతి పెద్ద ఉత్పత్తిదారు రష్యా రణరంగంలో ఉన్నందున దానిపై ఆధారపడ్డ అనేక దేశాలు, అక్కడి కంపెనీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కొని మునుపటి స్థితికి చేరుకుంటున్న దేశాలకు.. తాజాగా పెరగనున్న గ్యాస్, పెట్రోల్ ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. ఆ దేశాల్లో అభివృద్ధి నెమ్మదించే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనిని సరైన రీతిలో ఎదుర్కోకపోతే ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఇప్పుడు సవాలుగా నిలువనుంది.
అంతేకాక పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధ భయాలను సూచిస్తున్నాయి. దీని వల్ల గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు రెండితలయ్యే ప్రమాదం ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఇవీ చదంవండి..
Vodafone: ఎయిర్‌టెల్‌కు తన వాటాను విక్రయించనున్న వోడాఫోన్.. డీల్ విలువ ఎంతంటే..
Mukesh Ambani: గ్రీన్ ఎనర్జీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది.. 21 వ శతాబ్దం మనదే: ముఖేష్ అంబానీ