PAN Card: ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్‌కార్డు వాడారో..!

| Edited By:

Mar 03, 2020 | 8:29 AM

మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ.. ఆ పాన్‌కార్డులను ఉపయోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది.

PAN Card: ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్‌కార్డు వాడారో..!
Follow us on

PAN Card: మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ.. ఆ పాన్‌కార్డులను ఉపయోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది. గడువు తేదీలోగా పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయని వినియోగదారులపై న్యాయపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 272B ప్రకారం రద్దైన పాన్‌ కార్డు వాడితే 10వేల రూపాయల జరిమానా విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌139 ప్రకారం, జూలై1, 2017ముందు కార్డు పొందిన ప్రతి వ్యక్తి కచ్చితంగా తన ఆధార్‌ నెంబరును ఐటీశాఖకు తెలపాల్సి ఉంటుందని తెలిపింది.

పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తే ఆర్థిక, బ్యాంకింగు, ప్రాపర్టీ కొనుగోలు-అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్ల లావాదేవీలు.. ఇలా ప్రతి వాటిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానం కోసం గడువును పలుమార్లు పొడగించిన ఐటీశాఖ.. ఈసారి మాత్రం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా గడువు తేదీ ముగిసిన తరువాత కూడా పాన్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే వీలుంది. ఇంకెందుకు ఆలస్యం మీ పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయకపోతే త్వరగా చేసుకోండి.

Read This Story Also:  కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం.. కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్