Telugu News Business LIC WhatsApp Services: Here’s How Users Can Check Policy Status, Premium and others Details
LIC WhatsApp Services: పాలసీదారులకు గుడ్‌న్యూస్.. ఎల్‌ఐసీలో వాట్సాప్ సేవలు.. ఈ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొబైల్‌లోనే ఎల్‌ఐసీ..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొబైల్‌లోనే ఎల్‌ఐసీ సర్వీసులను అందించే విధంగా రూపొందిస్తోంది. ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం ఇటీవల తన మొట్టమొదటి వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఈ పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్ చాట్‌బాక్స్ ద్వారా ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్, స్టేట్‌మెంట్లతో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో తమ పాలసీలను నమోదు చేసుకోని పాలసీదారులు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సేవలను పొందేందుకు ముందుగా నమోదు చేసుకోవాలని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. www.licindia.in లో ఎల్‌ఐసీ కస్టమర్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా పాలసీదారులు తమ పాలసీని నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎల్‌ఐసి పాలసీ నమోదు చేసిన తర్వాత, వారు ఎల్‌ఐసి వాట్సాప్ సేవలను ఉపయోగించడానికి కొన్ని దశలను ఉపయోగించడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని సంస్థ తెలిపింది.