LIC Shares: మళ్లీ పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు.. లిస్టింగ్‌ తర్వాత 18.94 శాతం తగ్గిన స్టాక్‌..

|

Jun 10, 2022 | 3:33 PM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. శుక్రవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 1.70శాతం పతనమై రూ.709.70 వద్ద స్థరపడింది.

LIC Shares: మళ్లీ పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు.. లిస్టింగ్‌ తర్వాత 18.94 శాతం తగ్గిన స్టాక్‌..
LIC
Follow us on

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. శుక్రవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 1.70శాతం పతనమై రూ.709.70 వద్ద స్థరపడింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయిన తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా భారీగా పడిపోతోంది. ఎల్‌ఐసీ షేర్లను ఇన్వెస్టర్లకు రూ.949కి కేటాయించారు. షేర్లు డిస్కౌంట్‌తో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయ్యాయి. దీని మార్కెట్ క్యాప్ ఇప్పటికీ SBI, HDFC, భారతీ ఎయిర్‌టెల్ కంటే ఎక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో మార్కెట్లో లిస్ట్ అయిన Paytm, Zomato, Nykaa వంటి కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయిన పెట్టుబడిదారులకు ఎల్ఐసీ మరింత పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఎల్ఐసీ ర్యాంకింగ్ 5వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ “ది ఎలిఫెంట్ దట్ కాంట్ డ్యాన్స్” అనే నివేదికలో ఎల్‌ఐసీపై హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ జూన్ 2023 వరకు టార్గెట్ ధర రూ. 875గా అంచనా వేసింది. మే 17వ తేదీన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఈ షేర్లు 8శాతం నష్టంతో లిస్టయ్యాయి. ఆ తర్వాత కూడా తీవ్ర ఒడుదొడుకుల మధ్య షేర్లు చలిస్తున్నాయి. ఇప్పటివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 25.22 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇష్యూ ధరతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6.02లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ విలువ రూ.4.5లక్షల కోట్లకు పడిపోయింది.ఎల్ఐసీ యాంకర్‌ ఇన్వెస్టర్ల 30 రోజుల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించే వీలు లభిస్తుంది. దీంతో లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిస్తే.. షేరు విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ హౌస్ Macquarie ఈ స్టాక్‌కు టార్గెట్ ధరను రూ. 1000గా నిర్ణయించింది. అస్థిరత కారణంగా దాని ఎంబెడెడ్ విలువ ప్రభావితమైందని చెబుతోంది.