Telugu News Business LIC services are available online too, It is very easy to know the policy status, LIC Policy Status details in telugu
LIC Policy: ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. పాలసీ స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటిగా ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా సేవలను అందించే మొదటి బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. జీవిత బీమా అంటే ఎల్ఐసీ అనే విధంగా ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ నేపథ్యంలో వినియోగదారులకు చేరువ కావడానికి ఎల్ఐసీ అనేక కీలక చర్యలను చేపట్టింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటిగా ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా సేవలను అందించే మొదటి బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. జీవిత బీమా అంటే ఎల్ఐసీ అనే విధంగా ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ నేపథ్యంలో వినియోగదారులకు చేరువ కావడానికి ఎల్ఐసీ అనేక కీలక చర్యలను చేపట్టింది. చాలా మంది వినియోగదారులు పాలసీ తీసుకున్న తర్వాత కేవలం బీమా ప్రీమియం చెల్లించే సమయంలో పాలసీకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇటీవలే ఎల్ఐసీ పాలసీలను ఆన్‌లైన్ చెల్లింపులను ప్రారంభించిన కంపెనీ ఆన్‌లైన్ ద్వారానే చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవలకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత పాలసీ స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే వీలు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆన్‌లైన్ సేవలకు యాక్సెస్ ఇలా
ఎల్ఐసీ అధికారిక వెబ్‌పేజీని సందర్శించి, “ఆన్‌లైన్ సర్వీస్” క్లిక్ చేయాలి.
అనంతరం ఈ-సేవ పేజీ కింద ఉన్న కస్టమర్ పోర్టల్‌ను ఎంచుకోవాలి.
సైన్-అప్ ప్రక్రియ కోసం “న్యూ యూజర్‌ను ఎంచుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ వివరాలను పూరించండి.
యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత వినియోగదారు రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో ధ్రువీకరణ ఈ-మెయిల్‌ను అందుకుంటారు.
అనంతరం యూజర్ ఎల్ఐసీ ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో పాలసీ స్టేటస్ తెలుసుకోవడం ఇలా
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్ సేవల కింద ఉన్న “కస్టమర్ పోర్టల్”పై క్లిక్ చేయాలి.