LIC Policy: రోజూ రూ. 29 జమచేస్తే, రూ. 4 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. మహిళలకోసం ఎల్‌ఐసీ ప్రత్యేక పాలసీ.

|

Nov 09, 2022 | 6:58 PM

చాలా మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవిత బీమాను ప్లాన్‌ చేస్తుంటారు. ముఖ్యంగా నెల జీతంపై ఆధారపడే వారు సేవింగ్స్‌ రూపంలోనైనా పాలసీలను చెల్లిస్తుంటారు. డబ్బులు ఆదా చేయడంలో పాలసీలు కూడా ఒక మార్గంగా చూస్తుంటారు. ఇందులో భాగంగానే బీమా సంస్థలు...

LIC Policy: రోజూ రూ. 29 జమచేస్తే, రూ. 4 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. మహిళలకోసం ఎల్‌ఐసీ ప్రత్యేక పాలసీ.
Lic Plan
Follow us on

చాలా మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవిత బీమాను ప్లాన్‌ చేస్తుంటారు. ముఖ్యంగా నెల జీతంపై ఆధారపడే వారు సేవింగ్స్‌ రూపంలోనైనా పాలసీలను చెల్లిస్తుంటారు. డబ్బులు ఆదా చేయడంలో పాలసీలు కూడా ఒక మార్గంగా చూస్తుంటారు. ఇందులో భాగంగానే బీమా సంస్థలు సైతం వినియోగదారులను ఆకర్షించే విధంగా పాలసీలను అందిస్తుంటాయి. ఇలాంటి వాటిలో లైఫ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ముందు వరుసలో ఉంటుంది. దేశవ్యాప్తంగా భారీగా ఉన్న ఏజెంట్లతో ఈ సంస్థ బలంగా ఉంది.

ఈ నేపథ్యంలో చాలా మంది ఎల్‌ఐసీలో పాలసీ తీసుకోవడానికి మొగ్గుచూపుతుంటారు. ఎల్‌ఐసీ కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొంగొత్త పాలసీలను తీసుకొస్తోంది. ఇలాంటి వాటిలో ఒకటి ఎల్‌ఐసీ ఆధార్‌ శిలా ప్లాన్‌. ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా మహిళలు, అమ్మాయిల కోసమే తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ద్వారా నెలకు రూ. 29 జమ చేస్తే రూ. 4 లక్షల రూపాయలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హులు.? లాంటి వివరాలు మీకోసం..

ఈ పాలసీ తీసుకుంటే మినిమం రిటర్న్‌ రూ. 75 వేలు గ్యారంటీగా పొందొచ్చు. అయితే గరిష్ట పరిమితి మాత్రం 3 లక్షలకు మించదు. అంటే పాలసీదారుడు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ 1 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీ ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇక ఈ పాలసీని 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు తీసుకొవచ్చు. ఇందుకు ఎలాంటి వైద్య పరీక్ష అవసరం లేదు. పాలసీదారుడు మధ్యలో మరణిస్తే కూడా డబ్బు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు ఈ పాలసీ ద్వారా రోజుకు రూ. 29 పెట్టుబడిగా పెడుతున్నారు అనుకోండి. ఏడాదికి రూ. 10,959 మొత్తం అవుతుంది. 30 ఏళ్ల వయసులో ఈ పాలసీని తీసుకుంటే 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 చెల్లించుకుంటూపోతే మొత్తం రూ. 2,14,696 పెట్టుబడిగా పెడ్తారు. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ ముగిసిన తర్వాత రూ. 3,97,000 వరకు రిటర్న్‌ పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..