LIC Credit Card: ఇకపై ఎల్‌ఐసీ నుంచి క్రెడిట్ కార్డులు.. ఎన్ని ప్రయోజనాలో..
ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కార్డుల ద్వారా మీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డులు వాడే యూజర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను ఉచితంగా పొందొచ్చు. ఇక వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సి అవసరం లేదు. ఇక వడ్డీ రేట్ల విషయంలో కూడా ఎల్‌ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. ఈ కార్డుపై వడ్డీ రేటు సంవత్సరానికి..
భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌ఐసీ, మాస్టర్ కార్డులు సంయుక్తంగా క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఎల్‌ఐసీ క్లాసిక్, ఎల్‌ఐసీ సెలక్ట్ పేరుతో రెండు కార్డులను లాంచ్ చేశారు. ఈ రెండు కార్డులను డిసెంబర్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కార్డుల ద్వారా మీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డులు వాడే యూజర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను ఉచితంగా పొందొచ్చు. ఇక వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సి అవసరం లేదు. ఇక వడ్డీ రేట్ల విషయంలో కూడా ఎల్‌ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. ఈ కార్డుపై వడ్డీ రేటు సంవత్సరానికి 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకీ ఈ కార్డుల్లో యూజర్లు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్‌ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు తీసుకున్న యూజర్లు ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ, వార్షిక ఫీజు కానీ చెల్లించాల్సి అవసరం లేదు. నెలకు 0.75 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రేట్లుగా నిర్ణయించారు. ఇక గరిష్టంగా నెలకు 3.5 శాతం, ఏడాదికి 42 శాతంగా ఉంటుంది. క్యాష్ విత్‌డ్రాయల్ విషయానికొస్తే 48 రోజుల వరకు అన్ని ఏటీఎమ్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక ఈ కార్డుతో ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది . లేట్ పేమెంట్ విషయానికొస్తే.. మొత్తం డ్యూ అమౌంట్‌లో 15 శాతం చెల్లించాలి. కనీసం రూ. 100 గరిష్టంగా రూ. 1250 వరకు ఉంటుంది.
ఇక ఈ క్రెడిట్ కార్డుతో తొలి ఈఎమ్‌ఐపైనా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్‌ఈజీ ప్లస్ మెంబర్ షిప్‌ను పొందొచ్చు. ట్రావెల్‌లో డొమెస్టిక్ ఫైట్‌లను బుక్ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్ పొందొచ్చు. లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు. భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం రాయితీని పొందొచ్చు. అయితే ఇది కేవలం రూ. 200 నుంచి రూ. 500 మధ్య లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.
ఇక ఎల్‌ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డు విషయానికొస్తే.. ఈ కార్డులో కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు ఏం లేవు. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు 48 రోజుల్లోపు లేవు. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రతి 300 నెలలకు రెండుసార్లు వస్తాయి. ఈ కార్డులో ప్రమాద బీమా రూ. 5 లక్షలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..