Lic Housing Loan: ప్రస్తుతం హోమ్ లోన్ కావాలంటే ఎన్నో మార్గాలున్నాయి. గతంలో ఉన్న ప్రాసెస్‌లాగా కాకుండా సులభమైన పద్దతుల్లో రుణాన్ని పొందవచ్చు. బ్యాంకుల్లోనే కాకుండా లైఫ్ ఇన్స్‌రెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) నుంచి కూడా గృహ రుణం పొందవచ్చు. అయితే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం ఉంటుంది. అయితే చేతిలో సరిపడ డబ్బులు లేకుండా హోమ్ లోన్ తీసుకొని ఇంటి కల నేరవేర్చుకోవాలని భావించే వారికి ఎల్‌ఐసీ సంస్థ హోమ్‌లోన్ అందిస్తోంది. అందుకు ఓ అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.
లైఫ్ ఇన్స్‌రెన్స్ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్స్‌పై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. అయితే ఈ బెనిఫిట్ కొందరికి మాత్రమే వర్తిస్తుంది. సిబిల్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ లభిస్తాయి. సిబిల్ స్కోర్ 700 లేదా ఆపైన ఉంటే.. వారికి వడ్డీ రేటు తగ్గుతుంది.
సిబిల్ స్కోర్ 700 లేదా ఆపై ఉంటే హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభం అవుతుందని. రూ.50 లక్షల వరకు రుణాలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని ఎల్‌ఐసీ చెబుతోంది. అదే ఎక్కువ మొత్తంలో రుణం అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. మీరు సిబిల్ వెబ్‌సైట్‌కు వెళ్లి స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇలా సిబిల్ స్కోర్‌ను బట్టి రుణాలు ఇచ్చే సంస్థలు తక్కువ వడ్డీకే లోన్స్ మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకుల కంటే ప్రైవేటు సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.
అలాగే పాలసీపై పర్సనల్ లోన్ కూడా పొందవచ్చు. ఎల్‌ఐసీలో అన్ని రకాల పాలసీలపై రుణ సౌకర్యం పొందటానికి వీలుండదు. టర్మ్, హెల్త్ ప్లాన్లపై లోన్ తీసుకోలేం. మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ వంటి పలు రకాల పాలసీలపై లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ పాలసీ సెరండర్ విలువలో 90 శాతం మొత్తం వరకే ఎల్‌ఐసీ రుణం అందిస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ వంటి డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పాలసీపై లోన్ తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి.
ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం కచ్చితంగా మూడేళ్లు చెల్లించాలి ఉండాలి. కనీసం 6 నెలల టెన్యూర్‌తో లోన్ పొందాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ డబ్బులను ఏడాదికి రెండు సార్లు కట్టేస్తూ రావాలి. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే.. ఎల్‌ఐసీ మీ పాలసీ డబ్బుల్లో లోన్ డబ్బులను కట్ చేసుకుంటుంది. ఇకపోతే మీరు లోన్ కోసం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లి సంప్రదించండి.