
మనం ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కేవలం నమ్మకం మీద కాకుండా, చట్టబద్ధమైన ఆధారాలతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో న్యాయనిపుణులు వివరించారు. అప్పుగా ఇచ్చిన సొమ్మును సురక్షితంగా తిరిగి రాబట్టుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలు, మరియు పాటించాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అప్పుల కోసం ఎక్కువగా ఉపయోగించే ఆధారం ప్రామిసరీ నోట్.
సాక్షులు: నోటు రాసేటప్పుడు కచ్చితంగా ఇద్దరు సాక్షులు ఉండాలి.
కాలపరిమితి: ప్రామిసరీ నోటుకు కేవలం మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగియకముందే అప్పును రాబట్టుకోవాలి లేదా కోర్టులో ‘మనీ రికవరీ సూట్’ వేయాలి.
గడువు పొడిగింపు: ఒకవేళ మూడేళ్లలోపు అప్పు తీరకపోతే, పాత నోటును రద్దు చేసి, ఇద్దరూ అంగీకారంతో కొత్త నోటు రాసుకోవడం ద్వారా కాలపరిమితిని మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.
అప్పు తీసుకున్న వ్యక్తి చెక్ ఇచ్చినప్పుడు, అది బ్యాంకులో నిధుల కొరత వల్ల బౌన్స్ అయితే అది నేరంగా పరిగణిస్తారు.
క్రిమినల్ కేసు: నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్(NI Act) కింద దీనిపై క్రిమినల్ కేసు వేయవచ్చు.
కోర్టు చర్యలు: కోర్టు అప్పు తీసుకున్న వ్యక్తికి జైలు శిక్ష విధించడమే కాకుండా, బాధితుడికి డబ్బు తిరిగి వచ్చేలా ఆర్డర్ చేస్తుంది. ముఖ్యంగా ఆస్తి లావాదేవీలు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల కొనుగోలులో చెక్ బౌన్స్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నగదు రూపంలో అప్పు ఇవ్వడం కంటే బ్యాంక్ ద్వారా డబ్బు పంపడం అత్యంత సురక్షితం. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ లేదా డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ చేసినప్పుడు, బ్యాంక్ స్టేట్‌మెంట్ అనేది కోర్టులో తిరుగులేని సాక్ష్యంగా మారుతుంది.
డబ్బు అప్పుతో ముప్పు: ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం నగదు రూపంలో అప్పు ఇస్తే, దానిని నిరూపించడం దాదాపు అసాధ్యం. సాక్షులు ఉన్నా, వారు కోర్టు మెట్లు ఎక్కడానికి ఇష్టపడకపోవచ్చు.
అప్పు ఇచ్చేటప్పుడు ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా ఇస్తే తిరుగులేని ఆధారాన్ని మీ దగ్గర పొందుపరుచుకోవచ్చు. అది మీ కష్టార్జితం వృథా కాకుండా చేస్తుంది. చట్టంపై అవగాహన కలిగి ఉండటమే ఆర్థిక భద్రతకు తొలి మెట్టు అని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..