భార్య ఉన్నా.. మరొకరితో ఆ యవ్వారం నడుపుతున్నారా.? ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి

పెళ్లైన పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అనేక న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. భార్య విడాకులు, భరణం కోసం కేసు పెట్టొచ్చునని.. పెళ్లైన విషయం దాచి మోసం చేశాడని, లేదా లైంగిక దాడి జరిగిందని గర్ల్‌ఫ్రెండ్ కేసు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

భార్య ఉన్నా.. మరొకరితో ఆ యవ్వారం నడుపుతున్నారా.? ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి
Extra Marital Affair

Updated on: Feb 27, 2026 | 5:08 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీసేంతవరకు వెళ్తున్నాయ్ కూడా. అయితే వివాహేతర సంబంధాలపై న్యాయనిపుణులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, పెళ్లైన అబ్బాయి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవచ్చా అనే ప్రశ్నకు, చట్టపరంగా తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా, మీ భార్యకు ఈ విషయం తెలిస్తే, ఆమె మీ మీద విడాకులు, భరణం (మెయింటెనెన్స్) కేసులు దాఖలు చేయవచ్చునన్నారు.

దీనివల్ల ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, మీరు ఎవరితో అయితే అఫైర్ పెట్టుకున్నారో, ఆ అమ్మాయి మీపై కేసు పెట్టాలని నిర్ణయించుకుంటే, పరిస్థితి మరింత జటిలం అవుతుంది. భారతీయ న్యాయ సంహిత(BNS)లోని సెక్షన్ 69 ప్రకారం, పెళ్లైన విషయం దాచిపెట్టి తప్పుడు వివాహ వాగ్దానం చేశారని ఆ అమ్మాయి మీపై కేసు నమోదు చేయవచ్చు. అలాగే, సెక్షన్ 63 ప్రకారం, లైంగిక దాడి కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. ఈ కేసుల వల్ల మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ విధమైన న్యాయపరమైన చిక్కులు మీ ఉద్యోగాన్ని, సమాజంలో మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాలను కలిగిస్తాయి.

Follow Us